Home » అబ్బాయిల్లో అమ్మాయిలు ఇష్ట‌ప‌డే 5ల‌క్ష‌ణాలు ఏంటో తెలుసా…!

అబ్బాయిల్లో అమ్మాయిలు ఇష్ట‌ప‌డే 5ల‌క్ష‌ణాలు ఏంటో తెలుసా…!

by AJAY
Published: Last Updated on
Ad

య‌వ్వ‌నంలో అబ్బాయిల‌యినా అమ్మాయిలైనా తాము స్పెష‌ల్ గా ఉండాల‌ని కోరుకుంటారు. అబ్బాయిలు అయితే అమ్మాయిల‌కు నచ్చాల‌ని….అమ్మాయిలు అయితే అబ్బాల‌కు న‌చ్చాల‌ని అనుకుంటున్నారు. కానీ ఎక్క‌వ‌గా అబ్బాయిలు అమ్మాయిల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కాగా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తారు అని ఓ సంస్థ స‌ర్వే చేయ‌గా అందులో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు అమ్మాయిలు.

Advertisement

 

అంతే కాకుండా వాళ్లు చెప్పిన‌వాటిలో ఓ 5 ల‌క్ష‌ణాలకు ప్రాముఖ్య‌త ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం….అబ్బాయిలు కీడ‌ల్లో రానిస్తే అమ్మాయిల‌కు చాలా ఇష్ట‌మ‌ట‌. కాలేజీలో అబ్బాయిలు క్రీడ‌ల్లో రానిస్తే అలాంటి అబ్బాయిల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. అంతే కాకుండా పాట‌లు పాడటం…డ్యాన్స్ లు చేయ‌డం లాంటి టాలెంట్స్ ఉన్నా కూడా అమ్మాయిల‌కు ఇష్ట‌మ‌ట‌. అదే విధంగా అమ్మాయిల‌కు రెస్పెక్ట్ ఇవ్వ‌డం…అమ్మాయిల‌ను గౌర‌వించ‌డం లాంటివి చేసే అబ్బాయిల‌ను కూడా ఎక్కువ లైక్ చేస్తార‌ట‌.

Advertisement

అలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేసినా ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ని న‌మ్ముతార‌ట‌. అంతే కాకుండా త‌మ‌కు ఇష్ట‌మైన‌వి కొనిచ్చే అబ్బాయిల‌ను కూడా అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఇష్ట‌మైన ఫుడ్ తినిపించ‌డం త‌మ‌కు నచ్చిన చోటుకు తీసుకువెళ్ల‌డం లాంటివి చేస్తే ఇట్టే ఇంప్రెస్ అయిపోతార‌ట‌. నిజాలు చెప్పే అబ్బాయిల‌ను కూడా అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.

అంతే కాకుండా మంచి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉన్న అబ్బాయిల‌కు జోక్స్ వేసే అబ్బాయిల‌కు అమ్మాయిలు సులభంగా ఇంప్రెస్ అవుతార‌ట‌. అలాంటి వాళ్లు ప‌క్క‌న ఉంటే ఎంజాయ్ చేయ‌వ‌చ్చని అనుకుంటార‌ట‌. అంతే కాకుండా నీట్ గా రెడీ అవ్వ‌డం..కాన్షిడెన్స్ తో క‌నిపించే అబ్బాయిలను కూడా చాలా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.

ALSO READ :

ఈ ఏడాది తొలి సూర్య‌గ్ర‌హ‌ణం ఎప్పుడో తెలుసా..?

“పోకిరి” లాంటి బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా…!

Visitors Are Also Reading