ప్రస్తుతం మనం గడుపుతున్న జీవితంలో ప్రతి గంటకీ పైసా కావాలి. ఏమి చేయాలన్న చేతిలో రూపాయి ఉండాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరికీ జాబ్ అనేది అవసరమే. ఒక ఇంట్లో భార్యా, భర్తా ఇద్దరూ కలిసి సంపాదిస్తే కానీ రోజు గడవని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో నచ్చినా నచ్చకపోయినా జాబ్ చేయడం మాత్రం మానలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైనా ఆక్సిడెంట్, లేదా హెల్త్ ఇష్యూ కారణంగా కొన్నాళ్ళు జాబ్ మానేయాల్సిన పరిస్థితి వస్తే ఇబ్బందికరమే.
Advertisement
ఈ సిట్యుయేషన్ ను ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడే తెలుసుకోండి. ఈ ఒక్క పని చేస్తే, జాబ్ పోతుందేమో, డబ్బులు రావేమో అన్న భయం ఉండదు. జాబ్ లాస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ సిట్యుయేషన్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే చాలా మందికి వీటి గురించి తెలియదు. ఎందుకంటే ఎక్కువ బీమా పాలసీలు లేకపోవడం ఓ కారణంగా చెప్పొచ్చు. కొన్ని ప్రైవేట్ బీమా కంపెనీలు మాత్రం యాడ్ ఆన్ పాలసీ లాగా వీటిని ఇస్తూ ఉంటాయి. కొంత ప్రీమియం వీటికి చెల్లిస్తూ ఉంటె, జాబ్ పోయిన సమయంలో ఈ కంపెనీలు ప్రతినెలా సాలరీని పంపిస్తాయి.
Advertisement
జాబ్ లాస్ ఇన్సూరెన్స్ కవర్ పేరిట పూర్తిస్థాయి పాలసీలు అయితే ప్రస్తుతానికి లేవు. కానీ కొన్ని ప్రైవేట్ బీమా కంపెనీలు మాత్రం యాడ్ ఆన్ పాలసీలను అందిస్తున్నాయి. ప్రభుత్వ పథకం కింద రాజీవ్ గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన కూడా ఉన్నది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ప్రస్తుతం ఈ పథకాన్ని నడుపుతోంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
రైల్వే స్టేషన్ మాస్టర్ వేతనం, సదుపాయాల గురించి మీకు తెలుసా ?
పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాధితో బాధపడ్డారా… అసలు ఏమైందంటే ?