త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు గాను సెలక్టర్లు తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపికచేసిన విషయం తెలిసిందే. 22 ఏండ్ల ఈ యువ ఆటగాడు దేశవాళీతో పాటు ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫునే గాక ఇండియా ‘ఎ’ తరఫున దుమ్మురేపుతున్నాడు.
Advertisement
ఇటీవల కాలంలో దేశవాళీలోనూ నిలకడగా ఆడుతున్న జురెల్.. భారత జట్టులో చోటు దక్కించుకోవడంపై ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ విషయం తెలియగానే తన కుటుంబం మొత్తం షాక్‌లో ఉన్నదని, తన తండ్రి అయితే తాను ఏ ఇండియా టీమ్‌కు సెలక్ట్ అయ్యావని ఆసక్తికరంగా అడిగినట్టు తెలిపాడు. సెలక్టర్లు జట్టును ప్రకటించిన తర్వాత జురెల్ మాట్లాడుతూ.. ఈ విషయం టీమిండియాకు సెలక్ట్ అవడం మా నాన్నకు చెప్పగానే ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.
Advertisement
‘నువ్వు ఏ ఇండియా టీమ్‌కు సెలక్ట్ అయ్యావ్’ అని మరోసారి కన్ఫమ్ చేసుకున్నాడు. అప్పుడు నేను రోహిత్ భయ్యా, విరాట్ భయ్యా ఆడే టీమ్‌కు సెలక్ట్ అయ్యా అని చెప్పా. నా కుటుంబం మొత్తానికి ఇది అత్యంత బావోద్వేగమైన సందర్భం..‘’ అని చెప్పుకొచ్చాడు. . భారత్ – ఇంగ్లండ్ మధ్య జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరుగనుంది.
తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, కెఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్‌ప్రిత్ బ బుమ్రా, అవేశ్ ఖాన్