మనదేశంలో ప్రతీ ఒక్కరికీ పాన్ తప్పకుండా అవసరం అయింది. మీరు ఒకవేళ పాన్ కార్డు పోగొట్టుకున్నట్టయితే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి డూప్లికేట్ పాన్ కార్డు ఈజీ ప్రాసెస్‌లో పొందవచ్చు. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్‌లో చట్టపరమైన ప్రక్రియ ఒరిజినల్ పాన్ కార్డు మాదిరిగానే ఉంటుంది. ఈ పాన్ కార్డును ప్రతీ చోట ఎటువంటి సమస్య లేకుండా ఉపయోగించవచ్చు.
Advertisement
అయితే ఈ డూప్లికేట్ పాన్ కార్డు కోసం అప్లై చేసుకున ప్రాసెస్ కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేయడం కన్నా ఈజీ. ఇందుకోసం ముందుగా TI-NSDL అధికారిక పోర్టల్ కి వెళ్లాలి. ఎడమవైపు ఆన్‌లైన్ పాన్ సేవను పొందడానికి క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆప్షన్‌లో ఆన్‌లైన్‌లో పాన్ సర్వీస్ ఎంచుకోవాలి. ఆ తరువాత స్క్రీన్ చేసి పాన్ కార్డు రీ ప్రింట్ పై క్లిక్ చేయాలి. ఆన్‌లైన్‌లో పాన్ కార్డు పొందడానికి అవసరమైన మొత్తం సమాచారాన్ని ఎంట్రీ చేయాలి. ఆ తరువాత క్యాప్షకోడ్ ని ఫుల్ చేయాలి. దరఖాస్తు ఫారంను సమర్పించాలి. ఈ సమయంలో ఓటీపీ కూడా పొందుతారు.
Advertisement
Also Read : కూతురు మంజూలకు కృష్ణ ఇంత అన్యాయం చేశారా..?
దేశంలో పాన్ కార్డు డెలివరీ చేయాలంటే దాని ధర రూ.50గా ఉంది. అదే పాన్ కార్డుని దేశ వెలుపల డెలివరీ చేయడానికి రూ.959 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన తరవాత రికార్డుగా నెంబర్ ఇవ్వబడుతుంది. ఒరిజినల్ పాన్ కార్డు పోయినప్పుడు డూప్లికేట్ పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. కార్డులోని అడ్రస్ సంతకం ఏదైనా మార్చాలనుకుంటే కూడా డూప్లికేట్ పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డు పోయిన లేదా దొంగలించబడిన ఈ పాయింట్లను గుర్తించుకోవాలి. ఇందుకోసం ముందుగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి. డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సమీప పోలీస్ స్టేషన్లో ఈ ప్రాసెస్ పూర్తి చేసి ఆన్‌లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు.
Also Read : అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే ఫలితం పక్కా..!