Home » బిగ్ బాస్ నుంచి బయటికి రావడానికి కారణం అదే అంటే అస్సలు ఒప్పుకోను అంటున్న గీతూ..!

బిగ్ బాస్ నుంచి బయటికి రావడానికి కారణం అదే అంటే అస్సలు ఒప్పుకోను అంటున్న గీతూ..!

by Anji
Ad

బిగ్ బాస్ సీజన్ 6  హౌస్ నుంచి అనూహ్యంగా బయటకు వచ్చేసింది గీతూ.. టాప్ 5లో ఉంటానని.. ఫైనల్స్ కూడా  గెలుస్తానని  ప్రకటన చేసిన గీతూ ఎలిమినేట్ అయి బయటికి రావడం చూస్తుంటే అందరూ ఆశ్యర్యానికి గురవుతున్నారు.  హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఎమోషన్స్ లేవు.. నేను ఏడవను అని చెప్పిన గీతూ.. బయటకు రాగానే వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఎలిమినేషన్ లో శ్రీ సత్య, గీతూ పోటీపడగా గీతూ అవుట్ అయింది. గీతూకి  ఓట్లు తక్కువ పడటంతో బయటకు వచ్చేసింది. మొదట్లో ఈమె గేమ్ చూసి చాలా మంది తిట్టుకున్నారు. నాకు అంతా తెలుసు నాకు నచ్చినట్టే ఆడతా అంటూ.. హౌస్ లో రచ్చ  చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతూ మాట్లాడుతూ.. తన ఎలిమినేషన్ గురించి ఆసక్తికర  విషయాలను వెల్లడించింది. 

Advertisement

“బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ నిమిషం గెలవడం కోసమే నేను ఆడాను. కానీ జనానికి నేను నచ్చలేదేమో అని చెప్పింది. నాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూనే వస్తున్నాను. అయినప్పటికీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది హౌస్ లో అందరితో పెద్దగా స్నేహం ఏర్పడడానికి ముంద నేన కాస్త దూకుడుగా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ  తరువాత నా లో లోపాలను నాగార్జున సార్ చెబుతుంటే సరిదిద్దుకుంటూ వచ్చాను” అని గీతూ తెలిపింది.   

Advertisement

Also Read :  కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న శ్యామలాదేవి..!

“సిగరేట్లు, లైటర్ దాచిపెట్టినందుకు నన్ను బాలాదిత్య చాలా మాటలు అన్నాడు. నేను నటిస్తున్నానని ఆయన అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించింది. నేను హర్టయ్యాను. అందువల్లనే గేమ్ అయిపోయిన వెంటనే తిరిగి ఆయనకు లైటర్, సిగరేట్లు ఇవ్వలేదు. నేను ఎవ్వరినీ పర్సనల్ గా టార్గెట్ చేయను. ఎవరి ఎమోషన్లు వారికి ఉంటాయి. చేపల టాస్క్ లో సంచాలక్ గా నేను వ్యవహరించిన తీరు తప్పు అంటే మాత్రం నేను ఒప్పుకోనూ.. బాలాదిత్య విషయ కారణంగానే నేను ఎలిమినేట్ అయ్యానని అస్సలు ఒప్పుకోను” అని గీతూ చెప్పుకొచ్చింది. 

Also Read :   అచ్యుత్ సినీ ఇండస్ట్రీలోకి రావడానికి అసలు కారణం ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading