Home » “గీతాంజ‌లి” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

“గీతాంజ‌లి” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

నాగార్జున కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో గీతాంజలి సినిమా కూడా ఒకటి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే అభిమానులు ఉన్నారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమా 1989లో మ‌ణిర‌త్నం దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ క్లాసిక్ చిత్రంలో గీతాంజలి పాత్రలో హీరోయిన్ గిరిజ నటించింది.

Advertisement

అయితే ఈ సినిమా తర్వాత ఎంతో క్రేజ్ వచ్చినప్పటికీ ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత గిరిజ కనిపించకుండా పోయింది. అయితే తాజాగా గిరిజ ఓ టీవీ ఇంటర్వ్యూలో దర్శనమిచ్చింది. గిరిజ భారతీయురాలు అయినప్పటికీ పుట్టింది పెరిగింది మాత్రం ఇంగ్లాండ్ దేశంలోనే. గిరిజన తండ్రి డాక్టర్ కాగా ఆమె తల్లి వ్యాపారవేత్త… అంతేకాకుండా గిరిజకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు.

Advertisement

ఇక గిరిజ భరతనాట్యం నేర్చుకోవ‌డం కోసం చెన్నైకి వచ్చింది. అక్కడ శ్రీకళా భరత్ వద్ద ఆమె భరత‌నాట్యం నేర్చుకుంటున్న సమయంలో శ్రీకళ సోదరుడు కృష్ణమాచారి శ్రీకాంత్ ద్వారా మణిరత్నం సుహాసిని ల‌కు పరిచయమైంది. మొదటిసారి మణిరత్నం గిరిజను చూసిన వెంటనే సినిమాల్లో నటిస్తారా అని అడిగాడు. ఇక గిరిజకు కూడా ఇంట్రెస్ట్ ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలా గిరిజ గీతాంజలి సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ సరైన హిట్ లు పడలేదు. దాంతో తిరిగి ఇంగ్లాండ్ కు ప‌యనం అయ్యింది. ఇక చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకు చాలా అవార్డులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేసింది. తనకు నంది అవార్డు సైతం వచ్చిందని చెప్పింది. అంతేకాకుండా గీతాంజలి సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున తో కలిసి నటించడం చాలా సరదాగా ఉండేదని చెప్పింది. నాగార్జున సరదాగా ఉంటారని ఆయనతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పింది.

ALSO READ : ప్రతి రోజూ బ్రౌన్ రైస్ తింటే పొట్ట తగ్గుతుందా ? కారణం అదేనా ?

Visitors Are Also Reading