గౌతమ్ గంభీర్.. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నాడు. కానీ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 లోకి కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెంట్స్ జట్టుకు మెంటార్ గా కూడా వ్యవరించాడు. అయితే గంభీర్ ఇండియా జట్టుకు ఆడుతున్న సమయంలో ఎలా ఉండేవాడో ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు. అతనిలో ఏ మార్పు అనేది లేదు అనే విషయం ఈ సీజన్ ఆరంభంలోనే అందరికి అర్ధం అనేది అయ్యింది.
Advertisement
కెప్టెన్ గా రెండుసార్లు కేకేఆర్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన గంభీర్.. 2016 లో ఇండియా జట్టుకు 2018 లో ఐపీఎల్ కు వీడ్కోలు అనేది పలికాడు. అయితే రాజకీయ రంగ ప్రవేశం కోసమే గంభీర్ ఐపీఎల్ కు వీడ్కోలు అనేది పలికాడు అని.. అతనిలో ఇంకా క్రికెట్ ఆడే సామర్ధ్యం ఉంది ప్రతి అభిమాని అనుకున్నాడు. అయితే అతడిని మల్లు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో చూడాలి అనుకునే అందరికి గంభీర్ గుడ్ న్యూస్ అనేది చెప్పాడు.
Advertisement
అయితే ఈ ఏడాదితో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా లెజెండ్స్ క్రికెట్ లో భాగంగా ఇండియా ఎలెవన్ vs వరల్డ్ ఎలెవన్ మధ్యలో మ్యాచ్ అనేది వచ్చే నెలలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఆడటానికి తాను సిద్ధంగా ఉన్నాను అని తాజాగా గంభీర్ ప్రకటించాడు. అయితే గంగూలీ కెప్టెన్ గా ఉన్న మన ఇండియా జట్టులో గంభీర్ కు స్థానం వస్తుందా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :