Telugu News » Blog » జీవిత చంపేస్తామని బెదిరించింది… “గరుడవేగ” నిర్మాతల సంచలన ఆరోపణలు..!

జీవిత చంపేస్తామని బెదిరించింది… “గరుడవేగ” నిర్మాతల సంచలన ఆరోపణలు..!

by AJAY
Published: Last Updated on
Ads

టాలీవుడ్ నటి జీవిత ఈ మధ్య తరచూ ఏదో ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా ఓ సినిమా ఫంక్షన్ లో ఓ కులం ప్రస్తావన తీసుకువచ్చి చిక్కుల్లో పడ్డారు. అంతే కాకుండా రాజశేఖర్ హీరోగా నటించిన గరుడవేగ సినిమా విషయంలోనూ నిర్మాతలతో జీవిత కు విభేదాలు వచ్చాయి. ఈ అంశం పై తాజాగా జీవిత స్పందించారు.

ఈ అంశం కోర్టులో ఉందని కోర్టులో తేలకముందే కొందరు తమ గురించి మీడియాలో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అనవసరం గా తమ కుటుంబం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయవద్దని అన్నారు. తాజాగా జీవిత వ్యాఖ్యలపై గరుడవెగ సినిమా నిర్మాతలు కోటేశ్వర రావు, హేమ లు మండిపడ్డారు. జీవిత మహా నటి జీవితంలో కూడా ఆమె అద్భుతంగా నటిస్తారని అన్నారు. అంతే కాకుండా జీవిత తమను చంపేస్తామని బెదిరించినట్లు చెప్పారు.

తాము ఎవరో కూడా తెలియదు అన్నట్టు జీవిత మాట్లాడారు అని తమ పరిది దాటి మాట్లాడారు అని మదిపడ్డారు. తాము పరువుగల కుటుంబం నుండి వచ్చామని…జీవిత సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోందని ఆరోపించారు. గరుడవేగా సినిమాకు తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించామని చెప్పారు. కోర్టులో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


You may also like