Ad
ఇప్పుడు క్రికెట్ విషయంలో ఎవరిని కదిలించిన అందరూ విరాట్ కోహ్లీ గురించే మాట్లాడుతారు. అయితే అందులో విరాట్ కు మద్దతు ఇచ్చేవారు అతడిని జంతులో కొనసాగించాలని కామెంట్స్ చేస్తే… మరికొందరు ఇంకా ఎన్ని రోజులు ఫామ్ లోని కోహ్లీని ఆడిస్తారు అంటారు. అయితే విరాట్ కోహ్లీ ఎలాంటి ఆటగాడు అనేది అందరికి తెలుసు. అంతర్జాతీయ క్రికెట్ లో 70 సెంచరీలు బాదిన విరాట్… ప్రస్తుతం రికీ పాంటింగ్ తో కలిసి ఎక్కువ శతకాలు కొట్టిన వారిలో సచిన్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ మూడేళ్ళుగా విరాట్ బ్యాట్ నుండి 100 అనేది రాలేదు.
ఈ క్రమంలో చాలా మంది ఫ్యాన్స్ తో పాటుగా.. మాజీ క్రికెటర్లు కూడా కొంతమంది కోహ్లీని జట్టునుండి తీసేయాలి అని అంటున్నారు. అందులో కపిల్ దేవ్, అజయ్ జడేజా, సెహ్వాగ్ వంటి వారు ఉన్నారు. కానీ కొంతమంది కోహ్లీకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గంగూలీ కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడుతూ.. కోహ్లీలో ఏంటో టాలెంట్ అనేది ఉంది. అతను ఇప్పటివరకు సాధించిన రికార్డులు.. కొట్టిన పరులు చూస్తే అది మనకు అర్ధం అవుతుంది.
విరాట్ అద్భుతమైన ఆటగాడు. కానీ కొంతకాలంగా అతను అలా ఆడటం లేదు. ఈ విషయం విరాట్ కు కూడా తెలుసు. కానీ త్వరలోనే అతను మళ్ళీ పాత ఫామ్ లోకి వస్తాడు. అయితే క్రికెట్ లో ఇలా ఫామ్ కోల్పోవడం అనేది మాములు విషయం. నేను, సచిన్, ద్రావిడ్ అందరం అలంటి పరిస్థితులను ఎదుర్కొనము. ఇప్పుడు కోహ్లీ దానిని ఎదుర్కొంటున్నాడు. అలాగే భవిష్యత్తులో ఇంకా చాలా మంది ఆటగాళ్లకు ఇది ఎదురవుతుంది. అలాంటప్పుడు బయట ఏం జరుగుతుందో ఆటగాడు తెలుసుకొని.. అందులో అవసరమైనది గుర్తుంచుకొని.. మిగితావి వదిలేసి తన ఆట తాను ఆడాలి అని దాదా పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
చిరంజీవి డ్యాన్స్ కు ఫిదా అయిపోయిన కోహ్లీ…!
పెళ్ళికి సిద్ధమైన ద్యుతీ చంద్.. ఎవరితో తెలుసా…?
Advertisement