టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ లో ఢిల్లీ నుంచి వస్తుండగా రూర్కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా యాక్సిడెంట్లో పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీం ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ క్రికెట్ కెరియర్ పై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
పంత్ తిరిగి ఎప్పుడు భారత జట్టులో చేరతాడా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై దాదా నీళ్లు చల్లాడు. పంత్ తిరిగి జట్టులోకి చేరడానికి ఏడాది నుండి రెండేళ్ల సమయం పడుతుందని అంచనా వేశాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ కెపిటల్స్ జట్టు మేనేజ్మెంట్ బాధ్యతల్లో ఉన్న గంగూలీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వాక్యాలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పంత్ స్థానాన్ని పూడ్చడం కష్టమన్న గంగూలీ,
Advertisement
అతని స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఎవరన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పంత్ కు ప్రమాదం జరిగిన నాటి నుండి అతనితో తాను రెండుసార్లు మాట్లాడినట్టు దాదా వెల్లడించారు. ప్రస్తుతం అతడికి కష్టకాలం నడుస్తోందని, గాయాలు, సర్జరీ నుంచి అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టు తెలిపాడు. తిరిగి కోలుకొని జట్టులోకి పునరాగమనం చేయాలంటే ఏడాది నుంచి రెండేళ్లయిన పట్టొచ్చని చెప్పుకొచ్చాడు.
READ ALSO : Shardul Thakur : మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫోటోలు వైరల్!