Home » బీసీసీఐని ఇవ్వం అన్నారు.. ఐపీఎల్ వద్దన్నాడు..!

బీసీసీఐని ఇవ్వం అన్నారు.. ఐపీఎల్ వద్దన్నాడు..!

by Azhar
Ad

ప్రస్తుతం బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే చర్చ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అధిక ధనికమైన క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐని ఇన్ని రోజులు దాదా ప్రెసిడెంట్ గా నడిపించాడు. కానీ ఈ నెల 18న బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు అనేవి జరగనున్నాయి. అయితే ఈసారి కూడా గంగూలీనే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటాడు అని చాల మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు దాదా ఆ రేస్ నుండి తప్పుకున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

అయితే బీసీసీఐలోని పెద్దలు అందరూ దాదాకు ఎదురు తిరిగినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు దాదా ఆ పదవిలో ఉంది పెద్దగా ఏం చేయలేదు అనే భావనలో బోర్డు సభ్యులు ఉన్నారు అని సమాచారం. అందుకే వారందరు దాదాకు బీసీసీఐని ఇవ్వం అని తెగేసి చెప్పినట్లు తెలుస్తుది. ఇక ఈ క్రమంలోనే మాజీ సెలక్టర్, ఆటగాడు అయిన రోజర్ బిన్నీ బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నిక కానున్నాడు అని చర్చ జరుగుతుంది.

Advertisement

ఇక ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ధనిక బోర్డుకు అధ్యక్ష పదవిని గంగూలీకి ఇవ్వడానికి ఇష్టపడని వారు.. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద లీగ్ అయిన ఐపీఎల్ యొక్క ఛైర్మెన్ గా ఉండాలని దాదాకు సూచించినట్లు తెలుస్తుంది. కానీ ఇది తన స్థాయికి తగ్గదు అని గంగూలీనే స్వయంగా ఐపీఎల్ యొక్క ఛైర్మెన్ గా ఉండటానికి నో చెప్పాడు అని తెలుస్తుంది. ఇక చూడాలి మరి దాదా ఏం చేస్తాడు అనేది.

ఇవి కూడా చదవండి :

రోహిత్ అలా పరుగులు చేస్తే వేస్ట్..!

ఇండియా, పాక్ మ్యాచ్ లో వారిదే విజయం..!

Visitors Are Also Reading