Ad
బీసీసీఐ అధ్యక్షడిగా మూడేళ్లు కొనసాగిన సౌరవ్ గంగూలీ మరో మూడేళ్లు కూడా ఆ పదవిలో ఉండాలి అనుకున్నారు. కానీ బీసీసీఐలో జరిగిన రాజకీయాలు అనేవి దాదాను మళ్ళీ అధ్యక్షా పీఠం పైన కుర్చోనివ్వలేదు. మొదట అందరూ దాదా వైపే ఉన్నా.. చివరి నిమిషంలో లెక్కలు అనేవి మారిపోయాయి. అందరూ దాదాకు వ్యతిరేకం కావడంతో ఇష్టం లేకుండానే దడ బీసీసీఐ పోటీ నుండి తప్పుకున్నాడు.
ఇక ఆ తర్వాత ఐపీఎల్ ఛైర్మెన్ పదవిని కూడా వదులుకున్న గంగూలీ.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. దాదా నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. బీసీసీఐకి చేసిన తర్వాత దాదా క్యాబ్ కు ప్రెసిడెంట్ చేయడం ఏంటి అనుకున్నారు. కానీ దాదా ఆ మాటలను వినలేదు. కానీ ఇప్పుడు ఉన్నటుండి గంగూలీ క్యాబ్ ప్రెసిడెంట్ పోటీ నుండి కూడా తప్పుకున్నాడు.
అయితే ఇప్పుడు క్యాబ్ నుండి తప్పుకోవడానికి ఓ కారణం అయితే ఉంది. క్యాబ్ ప్రెసిడెంట్ పదవికి గంగూలీ అన్న అయిన స్నేహశీల్ గంగూలీ పోటీ చేస్తున్నాడు. అందువల్లే దాదా ఈ పోటీ నుండి తప్పుకున్నాడు. దంతో దాదా అన్న ఏకగ్రీవంగా క్యాబ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబోతున్నాడు. ఎందుకంటే ఆ పదవికి ఆయన తప్ప ఇంకోరు నామినేష్ అనేది వేయలేదు. ఇక ఇప్పుడు క్యాబ్ నుండి తప్పుకున్న దాదా.. ఏం చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి :
ఇండియా, పాక్ మ్యాచ్.. గూగుల్ సీఈఓ కౌంటర్..!
అశ్విన్ సమయస్ఫూర్తికి ఫిదా అయిన కోహ్లీ..!
Advertisement