భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా వికెట్ కీపర్ గా మహేంద్రసింగ్ ధోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు. అందువల్ల ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తన తొందరపాటుతనం తో చాలా అవమానాలు పడ్డాడు. కానీ ఆ తర్వాత ఓ దారిలోకి వచ్చి ప్రశంసలు పొందారు.
Advertisement
అయితే ప్రస్తుతం ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ మళ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకు కారణం ముంబైతో జరిగిన మ్యాచ్ లో అతను తీసుకున్న నిర్ణయమే. అయితే ఐపీఎల్ సీజన్లో ఆఖరి మ్యాచ్లో ముంబై జట్టుపై విజయం సాధిస్తే ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరుకునేది. కానీ ఓడిపోయింది. ఈ ఓటమిలో కెప్టెన్ పంత్ తీసుకున్న రివ్యూలు కూడా భాగమయ్యాయి. బ్యాట్ కు తగిలి నేరుగా చేతిలోకి వచ్చిన దానిని రివ్యూ తీసుకోకుండా వేరే దానిని రివ్యూ తీసుకున్నాడు. దాంతో అతని పై విమర్శలు ఎక్కువయ్యాయి.
Advertisement
కానీ తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాన్త్ కు మద్దతుగా నిలిచాడు. ధోనికి ఎంతో అనుభవం ఉందని… కానీ అతడి స్థానంలో కొత్తగా వచ్చిన రిషబ్ పంత్ కూడా ఆ తరహా ప్రదర్శనలు చేయాలని అనుకోవడం చాలా తప్పు అని అన్నారు. ధోని అంతర్జాతీయ క్రికెట్ లో 500కు పైగా మ్యాచ్ మ్యాచ్లు ఆడాడు. కానీ మీరు చూసుకోండి… రిషబ్ పంత్ కెరియర్ ఇప్పుడే మొదలైంది. అతని అనుభవంలో సగం కూడా పంత్ కు లేదు. కాబట్టి ధోని చేసినవన్నీ పంత్ కూడా ఇప్పుడే చేయాలనుకుంటే ఎలా అని దాదా రిషబ్ కు మద్దతు ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి :
ఉమ్రాన్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం పై తండ్రి ఎమోషల్..!
ధోనీ మ్యాచ్ గెలవగానే వికెట్ ని చేతిలో ఎందుకు పట్టుకుంటారో తెలుసా..!!