Home » కోహ్లీ ఓ భిన్నమైన కెప్టెన్… అతను..?

కోహ్లీ ఓ భిన్నమైన కెప్టెన్… అతను..?

by Azhar
Ad

టీం ఇండియాకు 2016 లో పూర్తి స్థాయి కెప్టెన్ గా అవతరించిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఆరంభంలో టెస్టుల్లో నాయకునిగా తప్పుకొని కెప్టెన్సీకి పూర్తిగా దూరమయ్యాడు. ఇక ఆ తర్వాత ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ భారత జట్టును నడిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత జట్టుకు ఎక్కువగా దూరం అవుతున్నాడు అనే వాదన ఉన్న.. అతని న్యాయకత్వంలో జట్టు విజయాలు సాధిస్తుంది.

Advertisement

అయితే ఈ విషయంపై భారత జట్టు మాజీ కెప్టెన్… ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. టీం ఇండియా ఈ మధ్యకాలంలో అద్భుతమైన కెప్టెన్లను చూసింది. అయితే రోహి శర్మ చాలా నెమ్మదిగా పనులను చేస్తాడు. అతను ఎక్కువగా టెన్షన్ అనేది పడకుండా నీదంగంగా ముందుకు వెళ్తాడు. ఇక అతకముందు ఉన్న ధోని చాలా కూల్ కెప్టెన్. అతని ప్రతి విషయాన్ని బాగా మేనేజ్ చేస్తాడు. అందుకే సక్సెస్ అయ్యాడు.

Advertisement

కానీ విరాట్ కోహ్లీ మాత్రం వీరికి భునమైన కెప్టెన్. అతను ప్రతి విషయాన్ని కూడా భిన్నంగానే ఆలోచిస్తాడు. అయితే ప్రతి ఒక్క కెప్టెన్ కు కూడా తనదైన స్టైల్ అనేది ఉంటుంది. వారు తమ సొంత పద్దతిలోనే జట్టును నడిపిస్తారు. ఇక ఎవరు ఎవరు జట్టును ఎలా నడిపించిన జట్టుకు కావాల్సింది విజయం. అందుకోసం మేము ప్రతి కెప్టెన్ కు కావాల్సినంత సమయం అనేది ఇస్తాం అని గంగూలీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని ఆసియా కప్పులు గెలిచిందో తెలుసా..?

చాహల్, ధనశ్రీ వార్తలో వరుస ట్విస్టులు..!

Visitors Are Also Reading