Home » ఇండియా ప్రయోగాలు చెయ్యడం మంచిది కాదు..!

ఇండియా ప్రయోగాలు చెయ్యడం మంచిది కాదు..!

by Azhar
Ad

భారత జట్టులో ఈ మధ్యే ఎక్కువ మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు ముఖ్యమైన ఆటగాళ్లు గాయాల వల్ల జట్టుకు దూరం అవుతుంటే.. ఇంకొన్నిసార్లు బీసీసీఐ కావాలనే రెస్ట్ పేరిట ఆటగాళ్లను దురా పెడుతుంది. అందుకే ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ మధ్యే ఇండియా జట్టులో కనిపించారు. ఇక ఇప్పుడు ఆసియా కప్ కోసం యూఏఈ వెళ్లిన భారత జట్టు అక్కడ మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడింది.

Advertisement

ఇక ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన జట్టును చూసి కూడా అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ జట్టులో కీపర్ గా ప్రాంత కాకుండా.. దినేష్ కార్తీక్ ఉన్నాడు. అయితే పంత్ ఇప్పుడు జట్టుకు మూడు ఫార్మట్స్ లో కీలక కీపర్ గా వ్యవరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అతడిని జట్టు నుండి పక్కన పెట్టడం నచ్చింది కాదు అని టీం ఇండియా మాజీ ఓపెనర్ గంభీర్ అన్నారు.

Advertisement

గంభీర్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఇండియా జట్టు చేస్తున్న ప్రయోగాలు మంచివి కావు. ఈ ఆసియా కప్ తర్వాత ప్రపంచ కప్ ఉంది. కాబట్టి ఈ సమయంలో పంత్ కు పక్కన కూర్చోబెట్టాలి అనే నిర్ణయం సరైనది కాదు. పంత్ ఓపెనర్ గా, మిడిల్ ఆర్డర్. ఫినిషర్ ఇలా అన్ని రకాలుగా పనికివస్తాడు. కాబట్టి అతడిని జట్టు నుండి ఎక్కువ సేపు పక్కన ఉంచితే జట్టుకే నష్ట అని గంభీర్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కొత్త ఫీచర్స్ తేబోతున్న రిలయన్స్..!

బాబర్ వల్లే ఇండియా గెలిచింది.. ఎలా అంటే..?

Visitors Are Also Reading