ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా అందిరి నోటా అదే డైలాగ్‌లు. ఎక్కడ చూసినా ఆ సినిమా స్టెప్పులే.. అంతలా ప్రజల్లోకి దూసుకెళ్లింది ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమా. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐదు భాషల్లో విడుదలై భారీ విజయం అందుకున్నది. విడుదలైన అన్ని చోట్ల రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించనంతగా ఊర మాస్ లుక్‌లో కనిపించి మెప్పించారు బన్నీ. ముఖ్యంగా పుష్పరాజ్ గా బన్నీ అద్భుతంగా నటించారు. బాలీవుడ్ ప్రేక్షకులైతే బన్నీ నటనకు వావ్ అంటున్నారు.
Advertisement
తొలుత పుష్ప సినిమా కోసం సుకుమార్ చాలా మందిని అనుకున్నారట. హీరో పాత్ర దగ్గర నుంచి విలన్ పాత్ర వరకు పలువురిని సంప్రదించాట. వారు ఎవ్వరంటే మహేష్‌బాబుతో సుకుమార్ 1 నేనొక్కడినే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మహేష్ బాబుతో ఓ మాస్ సినిమా చేయాలని చూశారట సుకుమార్. అయితే అది పుష్ప చేయాలని తొలుత మహేష్‌బాబును సంప్రదించగా.. ఈ చిత్రాన్ని మహేష్‌బాబు సున్నితంగా తిరస్కరించారట. దీంతో పుష్ప సినిమా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లింది.
Advertisement
అదేవిధంగా పుష్ప సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించిన విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం సమంతను అనుకుడట సుకుమార్. గతంలో సుకుమార్ తీసిన రంగస్థలం చిత్రంలో రామలక్ష్మీగా ఆమె నటన ఎంతో ఆకట్టుంది. ఈ సినిమాలో శ్రీవల్లిగా చూపించాలని అనుకున్నారట సుకుమార్. పుష్ప సినిమాలో స్పెషల్ స్టెప్పులేసి అలరించింది సమంత. ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఈ పాట కోసం తొలుత బాలీవుడ్ బ్యూటీస్ దిశాపాటని, నోరా ఫతేహిను సంప్రదించారట. వీరిలో నోరా భారీగా డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారట. దిశాపాటని నో చెప్పేసిందట. విలన్ పాత్ర కోసం ముందుగా తమిళ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. పుష్పలో పోలీస్ క్యారెక్టర్ అయిన షికావత్ పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నారు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సేతుపతి ఆ పాత్రను వదులుకున్నారు. ఆ తరువాత బెంగాలీ నటుడు జిష్టు సేన్ గుప్త, టాలీవుడ్ హీరో నారా రోహిత్ కూడా సంప్రదించారట. వాళ్లు నో చెప్పడంతో ఆ ఛాన్స్ మలయాళ నటుడు ఫాజిల్‌కు దక్కింది. వీరందరూ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాను వదులుకున్నారు.