నవగ్రహాల్లో ఒక్కోక్క గ్రహానికి ఒక్కోక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే దేవగురువు బృహస్పతికి నవగ్రహాల్లో ప్రత్యేక స్థానముంటుంది. గురు బలం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలకు అధిపతి. ఆయన అనుగ్రహం లేనిదే ఏ పని చేయలేం. ఇక ఈయన కుమారుడు జీవిత భాగస్వామి, సంపద, విద్య, కీర్తి కారకుడిగా జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు ప్రత్యేక స్థానముంది. జులై 29న గురువారం బృహస్పతి మీనంలో తిరోగమనంలో ప్రవేశిస్తుంది. ఈ తిరోగమన స్థితి నవంబర్ 24 వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహరాశి
Advertisement
సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ కాలంలో వీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు అనుకున్న బడ్జెట్ పెరగవచ్చు. దీని కారణంగా మీరు రుణ గ్రహస్తులయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు రావచ్చు. పై అధికారులతో సామరస్య పూర్వకంగా వ్యవహరించండి. ఈ రాశి వారు గురు, ఆది వారాల్లో శనగలు, గోధుమలను నానబెట్టి ఆవుకు నైవేద్యంగా సమర్పించాలి. పండితులతో సంప్రదించి తగిన పరిహారాలు చేసుకోండి.
తులరాశి
Advertisement
ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. గురువుకు వృత్తి రీత్యా శుక్రుడు శత్రువుగా పరిగణింపబడతాడు. బృహస్పతి గ్రహం వక్ర గమనం వల్ల తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉండదు. ఈ సమయంలో మీరు మీ శత్రువుల నుండి అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మానుకోండి. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. గురు, శుక్ర వారాలు శనగలు, బొబ్బర్లను నవగ్రహాలకు నైవేద్యంగా సమర్పించండి. దీంతో పాటు ఆవుకు నానబెట్టిన శనగలు, బొబ్బర్లను పెడితే శుభ ఫలితాలను అందుకుంటారు.
మకర రాశి
ఈ రాశి వారికి అధిపతి శని దేవుడు. బృహస్పతి గ్రహం యొక్క వక్ర గమనం వల్ల మకర రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా డబ్బును కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారు గురు, శని వారాలు శనగలు నైవేద్యంగా పెట్టి.. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. ఈ విషయంపై విజ్ఞులైన పండితులతో సంప్రదించి దోష పరిహారాలు చేయించుకోండి.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అనుకోని వివాదాలు వస్తాయి జాగ్రత్త..!