Home » సింగ‌రేణిలో ప్ర‌మాదం.. న‌లుగురు కార్మికులు మృతి..!

సింగ‌రేణిలో ప్ర‌మాదం.. న‌లుగురు కార్మికులు మృతి..!

by Sravan Sunku
Ad

సింగ‌రేణిలో బొగ్గు గ‌నికి ఎంతో ప్రాధాన్య‌త ఉన్న‌ది. అక్క‌డ ఎంతో మంది కార్మికులు ప‌ని చేస్తుంటారు. కానీ నిత్యం అక్క‌డ‌ ఏదో ఒక చోట ప్ర‌మాదాలు సంభ‌విస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ గనిలో ప్రమాదం సంభ‌వించింది. అందులోకి పై క‌ప్పు కూల‌డంతో న‌లుగురు కార్మికులు మృతి చెందారు. ఇంకా రెస్క్యూ ఆప‌రేష‌న్ కొనుసాగుతుంది. మొద‌టి షిప్ట్‌లో కార్మికులు విధులు నిర్వ‌హిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఈఘ‌ట‌న‌పై న‌లుగురు కార్మికులే మృతి చెందారా లేక ఎక్కువ మృతి చెందార‌నే విష‌యాలు ఇంకా వెలుగులోకి రాలేదు.

Advertisement

Advertisement

ప్ర‌మాదం జ‌రిగిన సమయంలో నలుగురు కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.. 21 డీప్‌ 24 లెవెల్‌ వద్ద రూఫ్‌ కూలడంతో ప్రమాదం జరిగినద‌ని అధికారులు పేర్కొంటున్నారు. మృతిచెందిన కార్మికులు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్‌లు మృతిచెందినట్లుగా గుర్తించారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి స‌హాయక చర్యలను వేగ‌వంతం చేశారు. సింగ‌రేణిలో ప‌ని చేసే కార్మికులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు. లేని యెడ‌ల ఇలాంటి ప్ర‌మాదాలు సంభవిస్తాయ‌ని పేర్కొంటున్నారు.

 

Visitors Are Also Reading