Home » ఒక్కపుడు ఐసీసీ అంపైర్.. కానీ ఇప్పుడు చెప్పులు అమ్ముకుంటున్నాడు.. ఎందుకు..?

ఒక్కపుడు ఐసీసీ అంపైర్.. కానీ ఇప్పుడు చెప్పులు అమ్ముకుంటున్నాడు.. ఎందుకు..?

by Azhar
Ad
క్రికెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటలో ఒక్కటి. అయితే ఈ ఆటలో డబ్బు అనేది ఆటగాళ్లకు భారీగ అవస్తుంది అనేది తెలిసిందే. ఇక డబ్బుతో పాటుగా పేరు… గుర్తింపు కూడా వారు బాగానే సంపాదిస్తారు. అయితే ఆటగాళ్లతో పాటుగా అంపైర్లకు కూడా బాగానే ముడుతుంది అనడంలో సందేహం లేదు. అందులోన ముఖ్యంగా క్రికెట్ బాస్ అయిన ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్లకు ఇంకా అందరి కంటే ఎక్కువగా వస్తుంది. అయితే అలంటి అంపైర్లలో ఒక్కరు ఈరోజు చెప్పులు అమ్ముకుంటున్నాడు. అందుకు కారణం ఏంటో తెలుసా..?
పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఐసీసీ ప్యానెల్ అంపైర్ అసద్ రవూఫ్ జీవితం తలకిందులు అయిపోయింది. ఐసీసీ తరపున 13 ఏళ్ళు అంపైర్ గా పనిచేసిన రవూఫ్.. మొత్తం 98 వన్డేలు, 49 టెస్టులు, 23 టీ20 లకు అంపైరింగ్ అనేది నిర్వహించాడు. కానీ ఆయన ఈరోజు పాకిస్థాన్ విధుల్లో ఒక్క చిన్న షాపులో చెప్పులు, బొమ్మలు.. సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్మడుతూ తన జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఇందుకు కారణం ఆయన చూపిన తప్పే అని చెప్పాలి. ఇప లో కూడా అంపైరింగ్ నిర్వహించిన రవూఫ్… 2013 లో బుకీల నుండి బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇక ఈ విషయంపై విచారణ జరిపిన ఐసీసీ అసద్ రవూఫ్ పై 5 ఏళ్ళ నిషేధాన్ని విధించింది. దాంతో ఆయన జీవితం మారిపోయింది. అయితే తాజాగా అసద్ రవూఫ్ మాట్లాడుతూ… నా కొడుకు, కూతురు ఆరోగ్యం అప్పుడు బాగాలేకపోవడం వల్ల నేను అంపైరింగ్ ను పూర్తిగా వదిలేసాను అని చెప్పాడు. ఆలాగే తన జీవితాన్ని ఈలాగున కొనసాగించడానికి ఈ షాపు నడుపుతునని పేర్కొన్నాడు. అలాగే తనకు డబ్బు అంటే అంత మోజు లేదని.. తాను అదంతా ఇప్పటికే చూసాను అని చెప్పిన అసద్ రవూఫ్…. నా పై వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఐపీఎల్ లో అంపైరింగ్ చేశాను అని పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading