Home » ఢిల్లీ క్యాపిట‌ల్స్ అసిస్టెంట్ కోచ్‌గా భార‌త మాజీ పేస‌ర్

ఢిల్లీ క్యాపిట‌ల్స్ అసిస్టెంట్ కోచ్‌గా భార‌త మాజీ పేస‌ర్

by Anji
Ad

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ అసిస్టెంట్ కోచ్‌గా భార‌త మాజీ పేస‌ర్ అజిత్ అగార్క‌ర్ బుధ‌వారం అధికారికంగా నియ‌మితుల‌య్యారు. గురువారం శ్రీ‌లంక‌తో భార‌త్ స్వ‌దేశంలో జ‌రుగ‌నున్న సిరీస్‌కు వ్యాఖ్యానం పూర్తి చేసిన త‌రువాత అత‌ను జ‌ట్టులో చేర‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా అగార్క‌ర్ మీడియాతో మాట్లాడారు. ఈ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ భాగం అయినందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. క‌చ్చితంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్ర‌పంచంలోని అత్తుత్త‌మ ఆట‌గాళ్ల‌లో ఒక‌రైన రిష‌బ్ పంత్ నేతృత్వంలోని అద్భుత‌మైన జ‌ట్టు మాకు ఉంద‌ని చెప్పుకొచ్చాడు.

Advertisement

Advertisement

ఢిల్లీ జ‌ట్టుకు రీకీ పాంటింగ్ లాంటి గొప్ప కోచ్ ఉన్నాడు. అత‌నితో ప‌ని చేయ‌డానికి ఎదురుచూస్తున్నాన‌ని పేర్కొన్నాడు అగార్క‌ర్‌. భార‌త్ త‌రుపున 288 వ‌న్డే, 58 టెస్ట్ వికెట్లు తీశాడు. కోచ్ పాంటింగ్‌, స‌హాయ కోచ్ ప్ర‌వీన్ ఆమ్రే, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్‌తో కూడిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కోచింగ్ స్టాప్‌లో చేర‌నున్నాడు. అగార్క‌ర్ ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, ఢిల్లీ డేర్‌డేవిల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. అజిత్ అగార్కర్ టీమ్ ఇండియా తరఫున 191 వన్డే మ్యాచ్‌లను ఆడాడు. ఈ సమయంలో అతను 288 వికెట్లు తీశాడు. 26 టెస్టుల్లో 58 వికెట్లు తీసాడు. దీంతో పాటు 4 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అగార్కర్ 42 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 29 వికెట్లు తీసాడు.

Also Read :  తమిళనాడు స్థానిక ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ హవా….!

Visitors Are Also Reading