ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ఏన్నో ఏళ్లుగా వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న తమకు అధినేత మొండి చేయి ఇవ్వడంతో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తరుణంలో మాజీ హోంమంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తీవ్ర నిరాశకు గురయ్యారు. అత్యంత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించడం, తొలి నుంచి జగన్ వెంటే ఉండడం, సామాజిక సమీకరణల నేపథ్యంలో సుచరితకు మళ్లీ ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా హోంమంత్రి పదవీని తానేటి వనితకు ప్రకటించారు.
Advertisement
Advertisement
వైసీపీ కార్యకర్తలతో సమావేశం అయింది మాజీ హోంమంత్రి సుచరిత. తాజాగా ఆమె ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. అయినప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్నట్టు వెల్లడించారు. కొత్త మంత్రివర్గంలో సుచరితకు చోటు దక్కకపోవడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత స్పందిస్తూ.. మంత్రి పదవీ దక్కకపోవడంపై స్పందించారు. ముఖ్యంగా మంత్రి పదవి పోయినందుకు బాధ లేదు. తొలగించిన తీరు బాధ కలిగించింది. వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. జగన్ నాయకత్వంలో చివరి వరకు నడుస్తానని వ్యాఖ్యానించారు. మరొక వైపు అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించేందుకు సజ్జల మరోసారి ఆయన ఇంటికి వెళ్లడం గమనార్హం.
Also Read : CM Jagan: రోజా కోసం డేర్ స్టెప్ వేసిన సీఎం జగన్