శ్రీలంక దేశంలో చమురు నిల్వలు అడుగంటాయి. దేశవ్యాప్తంగా చాలా ఫిల్లింగ్ స్టేషన్లలో ఖాలీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగంటిపోవడమే ఇందుకు కారణం. రెండు షిప్పుల్లో చమురు వచ్చినప్పటికీ వాటికి చెల్లించడానికి తగిన మొత్తం తమ వద్ద లేదని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్ పిల ప్రకటించారు.
Also Read : ఉక్రెయిన్‌పై రష్యా ప్లాన్ సీ దాడులు చేయనుందా..?
Advertisement
విదేశాల నుంచి వచ్చే చమురు కొనుగోలు చేసేందుకు తగిన మొత్తం తమ వద్ద లేదని గత వారమే ఆ దేశ ప్రభుత్వ రంగ రిఫైనరీ సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే డీజిల్ అమ్మకాలు చేపట్డడంతో ఒక్క 2021లోనే 415 మిలియన్ డాలర్ల నష్టాన్ని ఆ సంస్థ ఎదుర్కుంది. ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడాలంటే చమురు రిటైల్ ధరలను పెంచడం ఒక్కటే మార్గం అని మంత్రి వెల్లడించారు.
Advertisement
ఇటీవల శ్రీలంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి 40వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్ శ్రీలంక ఫిబ్రవరి నెల మొదట్లో కొనుగోలు చేసింది. అదేవిధంగా పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లకు దాదాపు 500 మిలియన్ డాలర్లు రుణంగా అందించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. కేవలం చమురు మాత్రమే కాదు నిత్యవసర వస్తువులు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ శ్రీలంకపై బాగానే పడిందని చెప్పవచ్చు.
Also Read : హిజాబ్ వివాదంపై పెదవి విప్పిన షా…ఏమన్నారంటే….!