ప్రేమ ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో చెప్పలేం..ప్రేమకు కులం, మతాలతో సంబంధం ఉండదు. అంతే కాదు నిజమైన ప్రేమకు దేశాలతో సంబంధం ఉండదు. ఇక పలువురు క్రికెటర్ లు కూడా దేశంతో సంబంధం లేకుండా భారతీయ మహిళలను వివాహం చేసుకుని సంసార సాగరాన్ని సాఫీగా ఈదుతున్నారు. ఆ క్రికెటర్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం….విదేశాలకు చెందిన కొంతమంది క్రికెటర్లు భారతీయ మహిళలను వివాహం చేసుకున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం….పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాను వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం అన్యోన్య జీవితాన్ని గడుపుతున్నారు.
ఆస్ట్రేలియన్ క్రికెటర్ షాన్ విలియమ్ టైట్ ఇండియాకు చెందిన ర్యాంప్ మోడల్ మాసుమ్ సింగాను 2014లో వివాహం చేసుకున్నాడు. శ్రీలంక క్రికెటర్ మాజీ కోచ్ ముత్తయ్య మురళీదరన్ కూడా భారతీయ మహిళనే వివాహం చేసుకున్నాడు. 2005లో మురళీధరన్ చెన్నై కి చెందిన మాదిమలర్ రామూర్తి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 2006లో వీరికి ఓ బాబు కూడా పుట్టాడు.
Advertisement
Advertisement
అంతే కాకుండా పాకిస్థానీ క్రికెటర్ హసన్ అలీ కూడా భారత మహిళను వివాహం చేసుకున్నాడు. హసన్ అలీ భారత్ కు చెందిన సమియా అర్జూను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 2019లో జరగింది. అయితే సమియా భారత్ సంతతికి చెందిన మహిళ కాగా ప్రస్తుతం దుబాయ్ లో స్థిరపడింది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ప్రముఖ క్రికెటర్ లలో ఒకరు అయిన జహీర్ అబ్బాస్ భారత సంతతికి చెందిన రీటాను లండన్ లో 1980లో కలిసాడు. వీరు 1988లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఇంటర్ నేషనల్ క్రికెటర్ గ్లీన్ మ్యాక్స్ వెల్ కు భారత కు చెందిన విని రామన్ తో 2020లో ఎంగేజ్ మెంట్ జరిగింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మోషిన్ ఖాన్ భారత్ కు చెందిన నటి రీనా రాయ్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.
Also Read:నాటు నాటు.. పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు