Home » స్నేహ రెడ్డితో బన్నీ ప్రేమ విషయాన్ని ముందు ఆ హీరోయిన్ కి చెప్పారా..?

స్నేహ రెడ్డితో బన్నీ ప్రేమ విషయాన్ని ముందు ఆ హీరోయిన్ కి చెప్పారా..?

by Sravya
Ad

అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కొనసాగిస్తూ ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఇంకో సారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని
షేక్ చేయడానికి రెడీ అయ్యారు. త్వరలో పుష్ప టు సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకి రావడానికి సిద్ధమవుతున్నారు బన్నీ. తాజాగా అల్లు అర్జున్ తన 13వ పెళ్లిరోజు వేడుకల్ని జరుపుకున్న సంగతి మనకి తెలిసిందే. స్నేహ రెడ్డి తో అల్లు అర్జున్ వివాహం 2011వ సంవత్సరంలో అయింది.

allu-arjun-wife

Advertisement

ఈ క్రమం లోనే 13వ పెళ్లిరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్నేహ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తూ అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ స్నేహ లవ్ స్టోరీ గురించి ఒక వార్త సోషల్ మీడియా లో ప్రస్తుతం వైరల్ గా మారింది. అల్లు అర్జున్ తన లవ్ స్టోరీ ని ముందు ఒక హీరోయిన్ తో చెప్పారు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఎవరో కాదు సమంత. సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్ జామ్ అనే కార్యక్రమం లో అల్లు అర్జున్ పాల్గొన్నప్పుడు తన ప్రేమ విషయాన్ని సమంతకి ముందు చెప్పారని, ఆ విషయాన్ని రివిల్ చేశారు.

Advertisement

నేను స్నేహ రెడ్డిని ప్రేమిస్తున్నాను అన్న విషయం కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు అందులో ఒకరు సమంత అని అన్నారు. అసలు సమంతకి నేను ఎందుకు చెప్పానో ఇప్పటికే నాకు అర్థం కాలేదని బన్నీ అన్నారు. ఇలా బన్నీ చెప్పడంతో సమంత కూడా రియాక్ట్ అవుతూ ఆరోజు చాలా టెన్షన్ పడ్డారు. స్నేహ ఒప్పుకుంటుందా లేదా అనే టెన్షన్లో మీరు ఒక చిన్న పిల్లాడిలా మారిపోయారని ఇలా వీరి పెళ్లి రోజు సందర్భంగా పాత కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం గురించి బన్నీ ఫాన్స్ విని నవ్వుకుంటున్నారు. అలానే షేర్ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading