భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి ని తిరిగి T20 జట్టులోకి తీసుకోవడంపై సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏ.బీ. డివిలియర్స్ పాజిటివ్ గా స్పందించారు. వీరిద్దరూ 2022 ప్రపంచకప్ తర్వాత T20 లో పాల్గొనలేదు. దీంతో ఎంతోమంది యువకులను కాదని వీరిద్దరినీ ఎంపికచేయడంపై పలు దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే భారత సూపర్ స్టార్లకు మద్దతుగా నిలిచిన డెవిలియర్స్.. మెనేజ్ మెంట్ నిబద్ధతను మెచ్చుకున్నారు.
Advertisement
Advertisement
భారత టీ20 జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎంపిక ఆశ్చర్యం కలిగించలేదని చెబుతూ.. ‘2022 నవంబరులో చివరిసారిగా టీ20 ఆడిన కోహ్లీని అఫ్గానిస్తాన్ తో సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేశాయడం నాకెలాంటి ఆశ్చర్యం కలగలేదు. విరాట్, రోహిత్ ఎంపిక సంతోషాన్ని ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ గెలవాలంటే అత్యుత్తమ జట్టును తయారు చేసుకోవాలి. యువ ఆటగాళ్లకు అవకాశాలు చేజారుతాయన్న విమర్శల్ని అర్థం చేసుకోగలను. కానీ కెరీర్ చరమాంకంలో నాకూ ఇదే పరిస్థితి ఎదురైంది. విరాట్, రోహిత్‌లను జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయం. నాకు 35 ఏళ్లు ఉన్నప్పుడు మా క్రికెట్ బోర్డు ఇలానే ఆలోచించి ఉంటే బాగుండేది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం ముఖ్యం. వాళ్లు ప్రపంచకప్‌ను అందించగలరు’ అని డెవిలియర్స్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇప్పుడు డెవిలియర్స్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాాలో వైరల్ అవుతున్నాయి.