Home » స్వ‌యంకృషి సినిమా ఎఫెక్ట్…. చెప్పుల‌షాపుల పేరు మార్చిన య‌జ‌మానులు..!

స్వ‌యంకృషి సినిమా ఎఫెక్ట్…. చెప్పుల‌షాపుల పేరు మార్చిన య‌జ‌మానులు..!

by AJAY
Ad

మెగాస్టార్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్స్ లో స్వ‌యంకృశి సినిమా కూడా ఒక‌టి. చిరు కెరీర్ లో దాదాపు చేసిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొంద‌గా స్వ‌యంకృషి సినిమాకు స‌ప‌రేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు క‌ళాత‌ప‌స్వి కె విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. చిరంజీవి విశ్వ‌నాథ్ కాంబినేష‌న్ లో శుభ‌లేఖ సినిమా రాగా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర‌వాత రెండ‌వ సినిమాగా స్వ‌యం కృషి సినిమా వ‌చ్చి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది.

Advertisement

1987లో ఈ సినిమా విడుద‌లైంది. ఈ సినిమాలో విజ‌య‌శాంతి చిరంజీవికి జోడీగా నటించ‌గా మాస్ట‌ర్ అర్జున్ బాలుడి పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టే వ్య‌క్తిగా క‌నిపిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా కోసం మెగాస్టార్ నిజంగానే చెప్పుకుట్టే వ్య‌క్తి వ‌ద్ద ట్రైనింగ్ కూడా తీసుకున్నార‌ట‌. ఈ సినిమా చూస్తేనే మెగాస్టార్ చెప్పులు కుట్టే విధానాన్ని బ‌ట్టి ఆయ‌న‌కు ఎంతో నైపుణ్యం ఉన్న‌ట్టు మ‌నకు అర్థం అవుతంది.

Advertisement

అయితే చిరంజీవి అప్ప‌టికే విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ నటించిన స్వాతిముత్యం సినిమా చూశార‌ట‌.ఈ సినిమా చూసిన త‌ర‌వాత క‌మ‌ల్ న‌ట‌న విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం చూసి త‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌లేద‌ట‌. దాంతో తాను కూడా త‌న‌లోని న‌టన‌కు ప‌దును పెట్టాల‌ని స్వ‌యంగా చెప్పులు కుట్ట‌డం నేర్చుకుని ఆ పాత్ర‌లో జీవించేశాడు. ఇక ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌నాలు సృష్టించ‌డంతో చాలా మంది చెప్పులు కుట్టే వారు త‌మ దుకాణాల‌కు స్వ‌యం కృషి అని పేర్లు పెట్టుకోవ‌డం విశేషం.

అంటే మెగాస్టార్ చిరంజీవి న‌ట‌న స్వ‌యం కృషి సినిమా జ‌నాల‌ను అంత‌గా ప్ర‌భావితం చేశాయ‌న్నమాట‌. ఇక ప్ర‌స్తుతం చిరు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమాను పూర్తి చేయ‌గా ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

ALSO READ : 

వైరల్ అవుతున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెళ్లి పత్రిక చూసారా ?

VIRAL VIDEO : ఈ న‌డుం పై ఆమ్లెట్ వేయొచ్చు..స‌న్నీలియోన్ పై మంచు విష్ణు దారుణ‌మైన కామెంట్స్…!

Visitors Are Also Reading