సాధారణంగా ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మన నిత్యజీవితంలో చోటు చేసుకునే మార్పుల వల్ల మనకు రకరకాల సమస్యలు వస్తుంటాయి. వాస్తవానికి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవడం చాలా ఉత్తమం. ప్రధానంగా గర్భిణీ స్త్రీలకు పోషకాలు చాలా అవసరం. గర్భధారణ సమయంలో తల్లులు బలంగా, ఆరోగ్యంగా ఉండాలి. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి సమయంలో వారు ప్రధానంగా పౌష్టికాహారంపై దృష్టి సారించాలి. గర్భిణీ స్త్రీలకు రోజుకు 300 అదనపు కేలరీలు అవసరం అని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా.. చలికాలంలో వ్యాప్తి చెందే వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుంచి తమను తాము రక్షించుకోవడానికి గర్భిణీ స్త్రీలకు అదనపు రోగనిరోధక శక్తి చాలా అవసరం అవుతుంది. గర్భిణీల అవసరాలను తీర్చగలిగే ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పెరుగు :
సాధారణంగా కడుపులో పెరుగుతున్న బిడ్డ శరీర నిర్మాణానికి ఎముకలు దృఢంగా ఉండేందుకు కాల్షియం చాలా అవసరం. గర్భిణీ స్త్రీలు కాల్షియం పుష్కలంగా ఉండేటటువంటి పెరుగును తీసుకోవాలి. ఇక పులిసిన పెరుగును అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా పెరుగులో ఉండే మేలు చేసే బ్యాక్టిరియా కడుపు ఇన్ ఫెక్షన్లను నివారిస్తుంది.
గుడ్లు :
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇక గర్భీణీలకు గుడ్లలో ప్రోటీన్స్ ఉంటాయని అంగన్ వాడి కేంద్రాల్లో కూడా రోజుకు ఒక గుడ్డు చొప్పున గర్భిణీలకు పంపిణి చేస్తారు. ఇక ఇందులో కొలిన్, లుటిన్, విటమిన్ బీ 12, డీ, ఫొలెట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకలను బలంగా, దృఢంగా మార్చే శక్తి గుడ్డుకు ఉంటుంది. గుడ్డు తీసుకోవడం వల్ల శిశువు యొక్క కండరాలు అభివృద్ధికి సహాయపడుతుంది.
చేపలు :
Advertisement
సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో వచ్చే మంటను తగ్గిస్తుంది. రోగ నిరోధక కణాలను ప్రేరేపిస్తుంది. కొవ్వు చేపల్లో జింక్, సెలీనియం, సహజ విటమిన్ డీ వంటివి పుష్కలంగా ఉంటాయి.
నట్స్ వాల్ నట్స్ :
బాదం, జీడిపప్పు, ఖర్జూరం, సహజ ఫైబర్, చక్కెరలు, విటమిన్లు, మినరల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. నీరు అధికంగా ఉండే పండ్లకు ఇవి ఆహార ప్రత్యామ్నాయాలుంటాయి. చక్కెర, ఉప్పు కలిపిన స్వీట్లకు చాలా దూరంగా ఉండడం బెటర్.
బంగాళదుంపలు :
కొత్త తల్లులకు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బంగాళదుంపల్లో బీటా కెరోటిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఇది విటమిన్ ఏ ని ఉత్పత్తి చేస్తుంది. పిల్లల్లో కణజాల పెరుగుదలకు విటమిన్ ఏ చాలా అవసరం. గర్భిణీ స్త్రీలు రోజు 100 నుంచి 150 గ్రాముల బంగాళదుంపలను తినవచ్చు.
పచ్చి కూరగాయలు :
పీచు, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, ఫొలేట్, పొటాషియం వంటి పోషకాలు అందాలి అంటే పచ్చి కూరగాయలను ఎక్కువగా తినాలి. బీన్స్, సిట్రస్ పండ్లు, ధాన్యాలు తదితర వాటిని ఆహార జాబితాలో చేర్చాలి.
పప్పులు :
ప్రోటిన్, పీచు, మినరల్స్, ఐరన్, ఫైటో కెమికల్స్ తదితర పోషకాల అవసరాలను తీర్చడానికి పప్పులు, చిక్ పీస్, బీన్స్ గింజలు వంటివి తీసుకోవాలి. తల్లి పాల అవసరాలను తీర్చడంలో కాయ ధాన్యాలు ప్రత్యేకంగా సహాయపడుతాయి.
బెర్రీస్ :
బెర్రీస్ లో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని విటమిన్ సి బలపరుచుతుంది. ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చల్లని కాలంలో సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో బెర్రీ ఎంతగానో సహాయపడుతాయి.
Also Read : వెల్లుల్లికి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. ఒకవేళ తింటే అంతే సంగతులు..!