కరోనా కాలంలో కూడా ఆదేశ ప్రజలు ఆకలికి అలమటిస్తుంటే అణ్వాయుధాల ప్రదర్శననే ముఖ్యం అనుకున్నారు కిమ్. ఉత్తరకొరియాలో ఆహార కొరత ఏ స్థాయిలో ఉన్నదో కిమ్ ప్రసంగంతోనే తెలుస్తుంది. అధికారం చేపట్టి పదేళ్ల కాలం గడిచిన సందర్భంగా కీలక సమావేశం నిర్వహించాడు కిమ్‌జోంగ్ ఉన్. ఆకలి మరణాలు, ఆహార కొరతను అధిగమించడం, ప్రజలకు పోషకాహారం అందించడమే ప్రధాన ఎజెండాగా సమావేశం సాగడం విశేషం. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను ఏ విధంగానైనా సరే గాడిలో పెట్టాలని ప్రసంగించాడు. ప్రత్యేకంగా ఫుడ్‌స్టఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. కిమ్ బాగా చిక్కిపోయి కళ తప్పిన ముఖంతో ఉన్న ఫోటోలు వైరలయ్యాయి.
Advertisement
Advertisement
ముఖ్యంగా ఉత్తరకొరియా పౌరులు తీవ్ర దుస్తితి, సంక్షోభం ఎదుర్కున్నారో తనకు తెలుసు అని పేర్కొన్నాడు. 2022ను గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ ఇయర్‌గా పేర్కొన్నాడు కిమ్. అప్పట్లో న్యూక్లియర్ వెపన్స్ తయారీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నడని ఐక్యరాజ్యసమితి కూడా అతనిపై దుమ్మెత్తి పోసింది. కరోనాకు తోడు భారీ వర్షాలు, వరదలు, కొరియా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. అక్కడి ప్రజలు ఆకలి చావులు అనుభవిస్తున్నారు అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగపు దర్యాప్తు సంస్థ కూడా ఈ విషయాన్ని నిర్థారించింది.
సుదీర్ఘంగా సాగిన కిమ్ ప్రసంగంలో దేశ సమస్యల ప్రస్తావనే ఎక్కువగా కనిపించింది. గ్రామీణాభివృద్ధి ప్రణాళిక, పోషకాహారం, పిల్లల యూనిఫామ్స్, నాన్ సోషలిస్టిక్ కార్యకలాపాలను అణిచివేయడం వంటి అంశాలపైనే ఎక్కువగా సాగింది. మామూలుగా కిమ్ జోంగ్ ఉన్ చేసే ప్రసంగం ఎలాంటిదైనా అందులో అణ్వాయుధాలు.. దాయాది దేశాల ప్రస్తావని ఉంటుంది. కానీ తాజాగా చేసిన ప్రసంగంలో అమెరికా, దక్షిణకొరియా ప్రస్తావన లేకుండానే ముగిసిపోవడం అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అణ్వాయుధ సంపత్తి, కవ్వింపు, దాడులు వంటి అంశాలు ఏమి లేకపోవడం గమనార్హం.