Home » Diabetes: ఈ 5 స్నాక్స్ ను షుగర్ పేషంట్స్ హ్యాపీగా తినవచ్చు.. అవేంటో ఓ లుక్ వేయండి!

Diabetes: ఈ 5 స్నాక్స్ ను షుగర్ పేషంట్స్ హ్యాపీగా తినవచ్చు.. అవేంటో ఓ లుక్ వేయండి!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఇటీవల కాలంలో డయాబెటిక్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. పదిమందిలో ఐదు ఆరుగురికి కచ్చితంగా డయాబెటిస్ ఉంటోంది. డయాబెటిస్ ఉన్న వారు తమ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు స్వీట్స్ కి దూరంగా ఉండడంతో పాటు.. కొన్ని రకాల ఆహారపదార్ధాలకు కూడా దూరంగా ఉండాలి. అయితే.. షుగర్ తో ఉన్నవారికి ఎదో ఒకటి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించిన టైం లో ఈ ఐదు రకాల స్నాక్స్ ను హ్యాపీ గా తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూడండి.

Advertisement

నానబెట్టిన బాదం పప్పులను షుగర్ పేషంట్స్ అల్పాహారంగా తీసుకోవచ్చు. వీటిల్లో ఎక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. నిపుణుల లెక్కల ప్రకారం 30 గ్రాముల బాదంపప్పులో 15 విటమిన్లు ఉంటాయట. బాదాం పప్పులను తక్కువ పరిమాణంలో తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేలరీల సాంద్రత తక్కువగా ఉండే మరో ఆహార పదార్ధం పాప్ కార్న్. ఈ ధాన్యపు స్నాక్ కూడా మధుమేహం ఉన్నవారికి మంచిది. ఎక్కువ కాలరీలు ఉండవు.

Advertisement

అలాగే, వేయించిన చిక్ పీస్ తినడం కూడా మంచిదే. 100 గ్రాముల చిక్‌పీస్‌లో 9 గ్రాముల ప్రోటీన్ మరియు 7 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఎక్కువ కాలరీలు లేకుండా, శరీరానికి పోషణ ఇచ్చే ఆహారపదార్ధాలను మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎంచుకోవాలి. ఇంకా, అవకాడో, చియా సీడ్స్ కూడా డయాబెటిక్ రోగులకు మంచి చిరుతిండ్లు. ఇవి షుగర్ ని అదుపులో ఉంచడంతో పాటు చక్కని పోషకాలను శరీరానికి అందిస్తాయి. పాలల్లో నానబెట్టిన చియా సీడ్స్ డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.

మరిన్ని..

యూట్యూబర్ నెల ఆదాయం రూ. 30 లక్షలు.. నెంబర్ వన్ యూట్యూబర్ గా AP వాసి !

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

Visitors Are Also Reading