అదృష్టం అనేది ఎవరినీ ఎప్పుడు ఎలా వరిస్తుందో అని చెప్పడం ఎవరి తరం కాదు. దాదాపుగా ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ల పరిస్తితి కూడా అంతే. ఎవరూ కూడా ఊహించని విధంగా వీరు తొలి సినిమా ఛాన్స్ ను దక్కించుకున్నారు. ఒకరు సన్నబడితే చాలు అనుకుంటే.. సినిమా ఛాన్స్ వచ్చిందట. మరొకరు వ్యాజిలేన్ ప్రీగా వస్తుంది కదా.. అని ఫొటో దిగితే.. వెండితెరపై నటించే అవకాశం. ఇలా అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చారు.
కీర్తి సురేష్
Advertisement
తల్లి మేనక నటి కావడంతో ఈమె సినీ ఎంట్రీ చాలా సింపుల్‌గానే అయింది. అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా మూడు సినిమాల్లో నటించిన కీర్తిసురేష్ 2013లో మళయాళంలో గీతాంజలి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అయితే రామ్ నటించిన నేను శైలజ సినిమాతో పరిచయమైంది.
నివేథా థామస్
పాఠశాలలో చదువుతున్న సమయంలోనే నివేథా థామస్‌కు సినిమాల్లో నటించే అవకాశమొచ్చింది. ఓ మళయాళ సినిమాలో నివేథా చేసిన చిన్న పాప క్యారెక్టర్ కు కేరళ ప్రభుత్వం నుండి అవార్డు లభించింది. జెంటిల్‌మెన్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నివేథా.. ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయిపోయింది.
మెహరీన్
కెనడాలో నార్త్ ఇండియా అమ్మాయి మాదిరిగా అందాల పోటీలు జరుగుతుంటే తన కూతురును పాల్గొనాలని ప్రోత్సహించింది మెహరీన్ తల్లి. మొదట్లో బొద్దుగా ఉన్నా మెహరిన్. ఇక ఆ పోటీల కోసం సన్నగా తయారైందట. ఆ తరువాత పోటీలో గెలుపొందిన మెహరీన్ ను చాలా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నాయి. మోడల్ గా రాణిస్తున్న తరుణంలోనే మెహరిన్ కృష్ణగారి వీర ప్రేమగాథ అవకాశం వచ్చింది.
Advertisement
సాయిపల్లవి
సాయిపల్లవి తన చిన్నతనం నుంచే మంచి డ్యాన్సర్‌గా మారిపోయింది. ఆమె పలు డ్యాన్స్ షోలలో పాల్గొని సినీ ప్రముఖులను ఆకర్షించింది. మళయాళంలో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సాయిపల్లవి తెలుగులో ఫిదా సినిమాతో లైఫ్ టర్న్ అయింది.
అనుపమ పరమేశ్వరన్
ప్రేమమ్ సినిమా ఆడిషన్స్‌కు అనుపమ ఫొటోస్ పంపించింది అని తెలిసి ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరిగిందట. అనుపమ సినిమాల్లోకి రావడం వారి కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం లేదట. వారి కుటుంబ సభ్యులు ఎంత అసంతృప్తితో ఉన్నప్పటికీ ప్రేమమ్ సూపర్‌డూపర్ హిట్ కావడంతో ఆ తరువాత ఆఆ సినిమాతో మంచి విజయం రావడంతో ఇండస్ట్రీలో వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
రాశి ఖన్నా
చదువుకునే రోజుల్లో కళాశాల అమ్మాయిలకు ఒక ఫొటో షూట్ నిర్వహించింది వ్యాజిలెన్ కంపెనీ. ఈ ఫొటో షూట్‌లో పాల్గొన్న అమ్మాయిలకు వారి ప్రొడక్ట్స్ ఉచితంగా ఇస్తాం అని చెప్పడంతో రాశీఖన్నాఫొటో దిగింది. ఆమె ఫొటో నచ్చి వ్యాజిలెన్ వారు ఒక మ్యాగజైన్ కవర్ ఫొటోలో పెట్టడంతో ఆ ఫొటో చూసి చాలా కంపెనీ వారు రాశీఖన్నాను వారి మోడల్‌గా ఎంచుకున్నారు. మోడల్‌గా బిజీగా ఉన్న సందర్భంలో మద్రాస్ కెఫె సినిమమాతో పాటు తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాలో అవకాశాలొచ్చాయి.