భారత మాజీ కెప్టెన్.. మూడు ఐసీసీ టైటిల్స్ అందుకున్న ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఇక క్రికెట్ లోనే కాకుండా బయట వాణిజ్యం పరంగా.. యాడ్స్ ద్వారా కూడా ధోని కొన్ని వందల కోట్లు సంపాదించాడు. అన్ని కోట్లు ఉన్న ధోని పైన ఇప్పుడు ఓ చెక్ బౌన్స్ కేసు నమోదయ్యింది. అది కూడా కేవలం 30 లక్షలకు మాత్రమే. అయితే ధోనికి కేసులు కొత్తేమి కాదు. గతంలో కూడా ధోని పైన ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ వివాదంలో కేసు నమోదయ్యింది. 2009 నుండి 2016 వరకు ఈ సంస్థకు ధోని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఆ సమయంలో ధోని క్రికెట్ కెరియర్ చాలా పిక్ లో ఉంది.
Advertisement
అదే విధంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. దాంతో ధోని ఇచ్చిన యాడ్స్ ను చూసి ఇందులో చాలా మంది ఫ్లాట్స్ కొనుగోలు చేసారు. కానీ ఆ సంస్థ అనుకున్న సమయంలో ఫ్లాట్స్ కట్టలేకపోయింది. దాంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. మేము కేవలం ధోనినే చూసి ఫ్లాట్స్ కొన్నామని అభిమానులు ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో ఉంది. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసు కూడా ధోని పై పడింది.
Advertisement
అయితే అసలు ధోని పై ఈ కేసు ఎలా పడింది అంటే… ఆమ్రపాలి మాదిరిగానే న్యూ గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా అనే కంపెనీకి ధోనీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ కంపెనీ వద్ద ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ రూ.30 లక్షల విలువైన ఎరువులను ఆర్డర్ చేసింది. ఆ సరుకు డెలీవరీ అయ్యింది. కానీ నిబంధనలను డీలర్ పాటించలేదన్న ఆరోపణలతో సరకు అమ్ముడుపోలేదు. అందువలన ఎరువులను న్యూ గ్లోబల్ వెనక్కి తీసుకొని ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ కు రూ.30 లక్షల విలువైన చెక్కు ఇచ్చింది. అది బ్యాంకులో డిపాజిట్ చేస్తే బౌన్స్ అయింది. లీగల్ నోటీసు పంపిన స్పందించకపోవడంతో… ఆ ప్రొడక్టును ప్రమోట్ చేసిన ఎంఎస్ ధోనీతో సహా ఏడుగురిపై ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ చెక్ బౌన్స్ కేసు పెట్టింది. ఇలా ధోని ప్రతిసారి తాను చేసినా తప్పుకు కాకుండా.. ఎవరో చేసిన తప్పుకు కేసులో ఇరుక్కున్నారు.
ఇవి కూడా చదవండి :