Home » ఐపీఎల్ లో మరో లక్కీ క్రికెటర్.. అతని వల్లే గుజరాత్ గెలిసిందంట..!

ఐపీఎల్ లో మరో లక్కీ క్రికెటర్.. అతని వల్లే గుజరాత్ గెలిసిందంట..!

by Azhar
Ad
బీసీసీఐ 2008 లో ప్రారంభించిన ఐపీఎల్ సీజన్ అనేది. ఇది సూపర్ సక్సెస్ అయ్యి బీసీసీఐ బోర్డుతో పాటుగా ఆటగాళ్ల పైన కూడా కాసుల వర్షం కురిపించింది. అలాగే చాలా మంది అఆటగాళ్లకు మంచి పేరును తెచ్చింది. కానీ ఒక్క ఆటగాడికి మాత్రం వింత పేరును తెచ్చింది. అతనే కరణ్ శర్మ. 2009 లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్పిన్ బౌలర్ కు ఐపీఎల్ లక్కీ క్రికెటర్ గా పేరు వచ్చింది. ఇతను ఏ జట్టులో ఉండే ఆయా జట్టు విజయం సాధిస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.
అయితే కరణ్ శర్మ పెద్దగా ఆడకపోయినప్పటికీ చాలా జట్లు అతడిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకు కారణం అతనికి ఉన్న పేరు. అయితే 2016 నుండి 2021 వరకు జరిగిన 5 సీజన్ లవ్ మూడు సార్లు ఇతను ఉన్న జట్లే టైటిల్ విజేతలుగా నిలిచాయి.2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2017‌లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఇలా వరుసగా అతను ఉన్న జట్లే విజయం సాధించాయి. కానీ ఈ ఏడాది అతని అదృష్టం రాయల్ ఛాలెంజర్ బెంగళూర్ జట్టుకు పనిచేయలేదు. అయితే ఇప్పుడు అతని కంటే మరో లక్కీ ఆటగాడు ఐపీఎల్ లో దర్శనమిచ్చాడు. అతనే వెస్టిండీస్ యువ పేసర్ డొమినిక్ డ్రేక్స్.
గత ఐపీఎల్ 2021 లో చెన్నై జట్టులో ఉన్న ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు డొమినిక్ డ్రేక్స్. కానీ ఆ జట్టు విజయం సాధించింది. ఇక ఈ ఏడాది వేలంలో కోటి 10 లక్షలకు గుజరాత్ టైటాన్స్ అతడిని తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఇక ఇప్పుడు ఆ జట్టు కూడా టైటిల్ అందుకుంది. దాంతో డొమినిక్ డ్రేక్స్ ఏ జట్టులో ఉంటె ఆ జట్టు విజయం అందుకుంటుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇతను మన కరణ్ శర్మ కంటే లక్కీ ప్లేయర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కరణ్ శర్మ ఒక్కటో రెండో మ్యాచ్ లు ఆడితే ఆ జట్టు గెలుస్తుంది. కానీ డొమినిక్ డ్రేక్స్ జట్టులో ఉండే చాలు ఒక్క మ్యాచ్ ఆడకపోయిన ఆ జట్టు విజయం సాధిస్తుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading