Home » నీటిలో త‌డిచిన‌ప్పుడు చ‌ర్మంపై ముడ‌త‌లు ఎందుకు ప‌డ‌తాయి…అనారోగ్యానికి సంకేత‌మా..?

నీటిలో త‌డిచిన‌ప్పుడు చ‌ర్మంపై ముడ‌త‌లు ఎందుకు ప‌డ‌తాయి…అనారోగ్యానికి సంకేత‌మా..?

by AJAY
Ad

వ‌ర్షంలో త‌డిచినప్పుడు లేదంటే ఎక్కువసేపు నీటిలో ఉన్న‌ప్పుడు అర‌చేతుల‌కు ముడత‌లు వ‌స్తుంటాయి. సాధార‌ణంగా ఇలాంటి ముడ‌త‌లు ముస‌లివాళ్ల చేతుల‌కు ఎప్పుడూ క‌నిపిస్తూనే ఉంటాయి కానీ చిన్న‌పిల్ల‌కు మరియు య‌వ్వ‌న‌స్తుల‌కు కూడా నీటిలో త‌డిచిన‌ప్పుడు క‌నిపిస్తుంటాయి. ఈ ముడ‌త‌లు కేవ‌లం అరిచేతుల్లోనే కాకుండా అరిపాదాల్లో కూడా క‌నిపిస్తుంటాయి. ఈ ముడ‌త‌లు నిజానికి వ‌స్తుంటాయి పోతుంటాయి. వీటి గురించి కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

FINGERS AFTER SOACKING

FINGERS AFTER SOACKING

కానీ అస‌లు ఇలా ముడ‌త‌లు ఎందుకు వ‌స్తాయా అని చాలా మందికి అనుమానం ఉంటుంది. కాబ‌ట్టి అలా ముడ‌త‌లు రావ‌డానికి అస‌లు కార‌ణాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ ముడ‌త‌లకు కార‌ణం అస్మోసిస్ అని వైద్యులు చెబుతున్నారు. అయితే దీని వ‌లన ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు. డెడ్ స్కిన్ పై ఇది ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని చెబుతున్నారు. ఎక్కువ సేపు నీటిలో ఉన్న‌ప్పుడు కొంత నీటిని చేతులు పీల్చుకుంటాయి.

Advertisement

Advertisement

ALSO READ : తులసి చెట్టులో వచ్చే ఈ మార్పు గమనించారా ? ఇది వీటికి సంకేతం అని మీకు తెలుసా ?

ఆ భాగం డెడ్ స్కిన్ అది ఉబ్బుతుంది. ఉబ్బిన భాగానికి ప‌క్క‌నే ఉన్న చ‌ర్మం లోప‌లికి ఉంటుంది. అది లివింగ్ స్కిన్ అది టైట్ గా ఉండి నీటిని పీల్చుకోదు అందువ‌ల్లే అది అలాగే ఉండిపోతుంది. అలా నీటిని పీల్చుకున్న చ‌ర్మం ఉబ్బ‌డం లివింగ్ స్కిన్ అదే విధంగా ఉండ‌టం వ‌ల్ల చేతిపై చార‌ల మాధిరిగా ముడ‌త‌లు ఏర్పడ‌తాయి.

Visitors Are Also Reading