Home » టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు తీసేసిన చిత్రాలు.. ఎంత దారుణమంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు తీసేసిన చిత్రాలు.. ఎంత దారుణమంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చాలా చులకన భావన ఉండేది. ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. కానీ అప్పట్లో తెలుగు సినిమాలు అంటే చాలా చీప్ గా చూసేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు.కానీ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాలు రియాలిటీ కి చాలా దూరంగా ఉండేవి. ఎవరికి అర్థం కాని రీతిలో సినిమాలు తీసి బొక్క బోర్లా పడేవారు. ముఖ్యంగా సినిమాల్లో అతి ఎక్కువగా ఉండేది. అంటే ఫైట్ సీన్స్ కానీ, అసలు మనిషితో సాధ్యం కానీ సీన్స్ కానీ పెట్టి చిత్రాలు తీసి ట్రోలింగ్ కు గురయ్యేవారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని సినిమాల్లోని ఫైట్ సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్నాటి బ్రహ్మనాయుడు నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాల్లోని ఫైట్ సీన్స్ ఇప్పటికి ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటాయి. ఇక బాలయ్య యాక్టింగ్ సీన్స్ ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. బాలయ్యను మరో లెవల్లో యాక్టింగ్ సీన్స్ లో చూపించాలని డైరెక్టర్లు ఓవర్ చేసేవారు.. దానికి నిదర్శనమే ఈ చిత్రం. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని ఫైట్స్ చూస్తే కళ్ళు బయర్లు కమ్మేలా ఉంటాయి. ముఖ్యంగా తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, హీరో చిటికేస్తే కుర్చీతోపాటు విలన్లు కూడా హీరో కాళ్ళ వద్దకు రావడం. ఇలా చెప్పుకుంటూ పొతే బాలయ్య సినిమాల్లో అతి ఎక్కువగా ఉండే సీన్స్ చాలానే ఉన్నాయి. ఇక వినయ విధేయ రామ.. రామ్ చరణ్ హీరోగా బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఫైట్ సీన్స్ కూడా లాజిక్స్ కు అందని రీతిలో ఉంటాయి.

Advertisement

హీరో ట్రైన్ పై నిలబడి బీహార్ వెళ్లడం, విలన్సును నరికితే తలలు గద్దలెత్తుకపోవడం, విలన్ ను కాటేసిన పామే చనిపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఓవర్ సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ శక్తి సినిమా ప్రేక్షకులకు ఒక సహనం అని చెప్పవచ్చు. సినిమాలోని ఫైట్ సీన్స్ ఓవర్గానే ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే హీరో ను కారు గుద్దితే కారే నుజు నుజ్జు అయిపోవడం,మితిమీరిన హీరో ఎలివేషన్స్, తండ్రి పాత్రలోని ఎన్టీఆర్ గెటప్ వంటి వాటి ట్రోల్స్ వచ్చాయి. ఇంకా ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన బంగారం, అల్లు అర్జున్ నటించిన వరుడు, మహేష్ బాబు నటించిన సైనికుడు వంటి సినిమాల్లో ఫైట్ సీన్స్ లాజిక్ కు ఏమాత్రం అందవు.

also read:

Visitors Are Also Reading