Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » భార్యా భర్తల మధ్య గొడవలు తగ్గాలంటే పూజ గదిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

భార్యా భర్తల మధ్య గొడవలు తగ్గాలంటే పూజ గదిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

by AJAY
Published: Last Updated on
Ads

ఇంట్లో గొడవలు ఉన్నాయంటే ఎవరికీ ప్రశాంతత ఉండదు. దాని ప్రభావం పిల్లలపై కూడా పడవచ్చు. ముఖ్యంగా ఇంట్లో భార్య భర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు తలెత్తుతుంటాయి. చీటికి మాటికి అలగటం ఇతర కారణాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండవచ్చు. ఎంత కలిసి ఉందామనుకున్నా కొంత మంది దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలు తీవ్ర స్థాయికి చేరితే పరిణామాలు కూడా దారుణం గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గొడవలు రాకుండా ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Advertisement

Also Read: సిరివెన్నెల ఇద్దరు కుమారులు తండ్రికి తగ్గ తనయులు…ఏం చేస్తున్నారో తెలుసా…?

Ad

అయితే ఈ గొడవలకు ఇంట్లో ఉండే కొన్ని పరిస్థితులు కూడా కారణం అవుతాయని శాస్త్రం చెబుతోంది. పూజ గదిలో చెత్తాచెదారం ఉండడం చిందరవందరగా ఉండటంవల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదట. అలాంటప్పుడు పూజగదిని తరచూ శుభ్రం చేస్తూ ఉండటం… కనీసం వారానికి ఒకసారైనా పూజగదిని శుభ్రం చేస్తూ ఉండాలట. అదేవిధంగా దేవుళ్ళ చిత్రాలను ఒక దానికి ఒకటి అంటిపెట్టుకుని ఉంచకూడదని శాస్త్రం చెబుతోంది. అలా ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతోంది.

కాబట్టి దేవుళ్ళ చిత్రాలు కాస్త దూరంగా ఉంచాలట అంతే కాకుండా కొన్ని సార్లు గాలి లేదా ఇతర కారణాల వల్ల దేవుళ్ళ చిత్రాలు పడిపోయే… పక్కకు జరిగే అవకాశం ఉంది. అయితే వాటిని అలానే చూస్తూ ఉండకూడదట. వాటిని కూడా ఏ స్థానంలో ఉన్నాయో మళ్లీ అదే స్థానంలో పెట్టాలట. ఇలా పూజ గదిని శుభ్రంగా ఉంచుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంట్లో దాదాపు అన్ని సమస్యలు తీరిపోతాయి అని శాస్త్రం చెబుతోంది.

Advertisement

Also Read: పవన్ కళ్యాణ్ కూతురు టాలెంట్ చూస్తే అవాక్కవాల్సిందే…!

Visitors Are Also Reading