Home » పవన్ కళ్యాణ్ కూతురు టాలెంట్ చూస్తే అవాక్కవాల్సిందే…!

పవన్ కళ్యాణ్ కూతురు టాలెంట్ చూస్తే అవాక్కవాల్సిందే…!

by AJAY
Ad

పవన్ కళ్యాణ్ ముద్దుల కుమార్తె ఆద్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ తో విడాకుల అనంతరం రేణుదేశాయ్ ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రేణు దేశాయ్ ప్రస్తుతం టీవీ షోలతో పాటు ఓ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రైతుల గురించి ఉండబోతోంది. ఇక టీవీ షోలు సినిమాలతో పాటు రేణుదేశాయ్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అకీరా నందన్ , ఆద్య ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇటీవల కరోనా లాక్డౌన్ సమయంలో ఆమె ఎంతోమందికి సేవ చేశారు.

Advertisement

Adhya singing video goes viral

Adhya singing video goes viral

సోషల్ మీడియా ద్వారా ప్లాస్మా అవసరం ఉన్నా మందుల అవసరం రేణూ దేశాయ్ షేర్ చేశారు. ఇక రేణుదేశాయ్ ఆద్యా, అఖిరా ల టాలెంట్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అప్పట్లో అఖీరా కర్ర సాము చేస్తున్న వీడియో ను షేర్ చేయగా తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఆద్య టాలెంట్ ను బయటపెట్టారు. వీడియోలో ఆద్య పియానో వాయిస్తూ ఇంగ్లీష్ పాటను పాడుతోంది. ఆద్య చక్కగా పియానో వాయిస్తూ తన వాయిస్ తో అంతే చక్కగా పాట పాడుతున్నారు. దాంతో ఈ వీడియోకు పవన్ అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Advertisement

ఆద్య లో ఇంత టాలెంట్ ఉందా అనుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో పియానో వాయిస్తూ చక్కగా పాట పాడటం అంటే తండ్రికి తగ్గ తనయ అంటూ పొగిడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు కూడా మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం అన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల అకీరానందన్ కూడా మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే అకీరా నందన్ హరి హరవీరమల్లు సినిమా తో ఎంట్రీ ఇస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

https://www.instagram.com/reel/CXBtkRPBnII/?utm_medium=copy_link

 

Visitors Are Also Reading