Fifa world cup 2022 మొదలైనప్పటి నుంచి ప్రపంచ స్టార్ ఆటగాడు అయినా లియోనాల్ మెస్సి గురించి వినిపిస్తోంది. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సి అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలబెట్టారు. దీంతో ఆయన పేరు మరోసారి మార్మోగిపోతుంది. ఈ రికార్డు సాధించి 24 గంటలు అయినా కానీ ప్రపంచ దేశాల్లోని చాలా మందికి మెస్సి ఫీవర్ పట్టుకుందని చెప్పవచ్చు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెస్సి మెస్సి అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.. అసోంకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అబ్దుల్ కలిక్ మెస్సిని అభినందిస్తూ ట్విట్ చేశారు.
Advertisement
also read:ప్రతీ శుక్రవారం నాడు మనీ ప్లాంట్ వద్ద ఇలా చేస్తే చాలు..డబ్బులే డబ్బులు !
Advertisement
మీకు అసోంకు సంబంధం ఉన్నందుకు చాలా గర్విస్తున్నానని తన ట్విట్ లో పేర్కొన్నాడు. ఇది చూసిన చాలామంది నేటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మెస్సి ఏంటి అసంతో సంబంధం ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఎంపీ చెప్పింది కరెక్టేనా అని అసలు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే ఒక నెటిజన్ ఎంపీకి ఈ విధంగా ప్రశ్నించాడు. మీరు చెప్పింది నిజమేనా అంటూ అడిగాడు. దీనికి ఎంపీ స్పందిస్తూ అవును నిజమే మెస్సి అసోం లోనే పుట్టాడు అంటూ బదులిచ్చాడు.
దీంతో ఈ ట్విట్ కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారింది. దీని తర్వాత ఇది ఫేక్ న్యూస్ అని తెలియడంతో ఒక్కసారిగా నిటిజన్స్ ఎంపీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. వివిధ రకాల కామెంట్లతో ఎంపీపై దుమ్మెత్తి పోశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఎంపీ తను మిస్టేక్ చేసానని గ్రహించి ట్విట్ ను తొలగించేసాడు. ఈ విధంగా మెస్సిపై చిన్న వార్త రావడంతోనే సోషల్ మీడియా అంత షేక్ అయిపోయింది. ఏది ఏమైనా ఫిఫా వరల్డ్ కప్ లో డిసెంబర్ 18న జరిగిన ఫైనల్ లో మెస్సి రెండు గోల్స్ తో మాయాజాలం చేసి అర్జెంటీనాను గెలిపించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
also read: