Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ప్రతీ శుక్రవారం నాడు మనీ ప్లాంట్ వద్ద ఇలా చేస్తే చాలు..డబ్బులే డబ్బులు !

ప్రతీ శుక్రవారం నాడు మనీ ప్లాంట్ వద్ద ఇలా చేస్తే చాలు..డబ్బులే డబ్బులు !

by Bunty
Ads

ఇల్లు మనకు దేవాలయం లాంటిది. మన ఇంటికి ఎంత బాగా చూసుకుంటే అంత మనకు మంచింది. అయితే, ప్రస్తుత కాలంలో ఇండోర్ ప్లాంట్స్ వైపు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణాల్లో ఇండోర్ ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలతో ఇంటిని అందంగా అలంకరిస్తున్నారు. అయితే ఇంట్లో పెంచుకునే చెట్లలో పలు రకాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా అందరికీ తెలిసిన చెట్టు మనీ ప్లాంట్. సాధారణంగా ఈ చెట్టు చాలా మంది ఇళ్లలో ఉంటుంది.

Advertisement

Read also : అరుదైన ఫోటో షేర్‌ చేసిన వైఎస్‌ షర్మిల.. మోడ్రన్‌ లుక్‌ అదిరిపోయిందిగా !

Ad

ఇది కేవలం అలంకరణగా మాత్రమే కాకుండా, శాస్త్ర ప్రకారం కూడా మంచిదే. ఇది మీ ఆర్థిక స్థితిని మార్చడానికి, ధన లాభాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. వాస్తుని అనుసరిస్తే అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాక ఆర్థిక ఇబ్బందులు వంటివి కూడా దూరం అయిపోతాయి. శుక్రవారం నాడు మనీ ప్లాంట్ వద్ద ఇలా చేస్తే ఆర్థిక బాధలు ఉండవని, ధన నష్టం కలగదు అని పండితులు అంటున్నారు. మరి శుక్రవారం నాడు ఏం చేయాలి అనేది చూసేద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే లక్ష్మీదేవి వస్తుంది.

ధన నష్టం వంటి ఇబ్బందులు కలగవు. ఒకవేళ కనుక మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదు అంటే శుక్రవారం నాడు మనీ ప్లాంట్ తీసుకురావడం వలన ధనం పెరుగుతుంది. లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజించడం వలన కూడా మీ ఇంట్లో ధనం పెరుగుతుంది. పచ్చిపాలని మనీ ప్లాంట్ మొక్కలో వేస్తే కూడా ధనం పెరుగుతుంది.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మనీ ప్లాంట్ ని నాటినప్పుడు మీరు గాజు సీసాలో వేస్తే మంచిది. మనీ ప్లాంట్ ని ఆకుపచ్చ రంగు బాటిల్ లో వేస్తే మంచిది.

Advertisement

READ ALSO : బాబుపై పోటీపై విశాల్‌ సంచలన ప్రకటన..కుప్పంలో నాకు చాలా వ్యాపారాలంటూ !

Visitors Are Also Reading