FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరంభంలో సత్తా చాటిన అర్జెంటీనా తొలి హాఫ్ లోనే రెండు గోల్స్ చేసి పై చేయి సాధించింది. ఈ సమయంలో కొంత తడబడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆట మొత్తం ఏకపక్షంగా బోరింగ్ గా సాగుతోందని అభిమానులు అనుకున్నారు. కానీ చివర్లో పుంజుకున్న ఫ్రాన్స్, 80వ నిమిషంలో పెనాల్టీ కిక్ కు ఎంబాపె గోల్ చేశాడు. ఆ మరో నిమిషంలోనే మరో గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. ఫ్రాన్స్ తరఫున అతను ఒక్కడే 4 గోల్స్ చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి : వాల్తేరు వీరయ్య ఫస్ట్ రివ్యూ.. సంక్రాంతికి చిరంజీవికి ఎలాంటి ఫలితం రానుంది?
Advertisement
ఎక్స్ ట్రా టైములో కూడా స్కోరులు సమం అవడంతో మ్యాచ్ పెనాల్టీ కిక్స్ దశకు చేరింది. ఈ సమయంలో కూడా ఫ్రాన్స్ తరఫున ఎంబాపేనే తొలి గోల్ చేశాడు. అర్జెంటీనా తరపున ముందుకు వచ్చిన మెస్సి, ఎప్పట్లాగే తన జీనియస్ ఉపయోగించి గోల్ చేశాడు. తర్వాత గోల్ చేయడంలో ఫ్రాన్స్ విఫలం అవగా, అర్జెంటీనా గోల్ చేసింది. మూడోసారి కూడా అదే కథ రిపీట్ అయింది. మరుసటి ఛాన్స్ లో మౌని ఫాన్స్ తరఫున గోల్ చేశాడు. అర్జెంటీనా తరపున మోంటీల్ కూడా గోల్ చేయడంతో 4-2 తేడాతో అర్జెంటీనా చరిత్ర సృష్టించింది. దీంతో ఎట్టకేలకు మెస్సి తన కల నెరవేర్చుకున్నాడు. వరల్డ్ కప్ ముద్దాడాడు.
Advertisement
కాగా, వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనాకు ఇది మూడో టైటిల్. ఆ జట్టు గతంలో 1978, 1986 లో ప్రపంచ విజేతగా నిలిచింది. ఇక, వరల్డ్ కప్ గెలిచి కెరీర్ కు వీడ్కోలు పలకాలన్న ఎస్సీ కళ ఘనంగా నెరవేరింది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అర్జెంటటీనాకు రూ. 347 కోట్ల భారీ ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ ఫాన్స్ రూ. 248 కోట్లు అందుకుంది. ఇది ఇలా ఉండగా, ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో రెండోసారి హ్యాట్రిక్ నమోదయింది. ఫ్రాన్స్ స్టార్ ఫుడ్ బాలర్ ఎంబాపె, అర్జెంటీనాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు. 80వ, 81వ, 118వ నిమిషాల్లో ఎంబాపె గోల్స్ కొట్టాడు. దాదాపు 56 ఏళ్ల క్రితం ఇంగ్లాండుకు చెందిన ఆటగాడు ఈ రికార్డు నమోదు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డు మళ్లీ రిపీట్ అయింది. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ ఓడటం గమనార్హం.
READ ALSO : వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఎన్టీఆర్ ప్రచారానికి.. తారకరత్న సంచలనం!