ప్రస్తుతం అన్ని గ్యాస్ సిలిండర్ లు ఉక్కువే ఉన్నాయి. ఉక్కు సిలిండర్ లలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఎక్కడకు తీసుకువెళ్లాలన్నా కష్టమే..ముఖ్యంగా పై అంతస్తులకు మోసుకువెళ్లాలంటే చాలా కష్టపడాలి. అంతే కాకుండా ఉక్కు సిలిండర్ లకు జంగుపట్టడం వల్ల ఇంట్లోని టైల్స్ కూడా పాడవుతూ ఉంటాయి. అయితే ఇకపై ఆ బాధలు తప్పనున్నాయి. ఇనుముకు బదులుగా ఫైబర్ తో తయారు చేసిన సిలిండర్ లను చమురు సంస్థలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతానికి ఇండేన్ ఈ ఫైబర్ సిలిండర్ లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మనం వాడుతున్న ఉక్కు సిలిండర్ ల బరువు 16 కిలోలు ఉండగా అందులో గ్యాస్ 14.2 కిలోల బరువు ఉంటుంది.
కానీ ఫైబర్ సిలిండర్ లు చాలా తేలికగా ఉంటాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇండేన్ 5 మరియు 10 కిలోల గ్యాస్ సిలిండర్ లను మాత్రమే అందుబాటులోకి తసుకువచ్చింది. 10 కిలోల సిలిండర్ లో రూ.670,5 తో గ్యాస్ నింపుకోవాల్సి ఉండగా…5 కిలోల గ్యాస్ సిలిండర్ లో రూ.330 పెట్టి గ్యాస్ నింపుకోవచ్చు. ఇక 5కిలోల సిలిండర్ ధర రూ. 2150 ఉండగా ఈ సిలిండర్ ను కొనాలనుకునేవారు పాత సిలిండర్ ను ఇచ్చి ఫైబర్ సిలిండర్ ను తీసుకెళ్లవచ్చు.
also read : బ్లాక్ బాక్స్: చాపర్ ప్రమాదం గుట్టు తెలుపు
ఈ సిలిండర్ లను ఇండేన్ సంస్థ హైదరాబాద్ లో జరుగుతున్న గో ఎలక్ట్రిక్ ఎక్స్ పో లో ప్రదర్శించింది. అంతే కాకుండా బుక్ చేసుకున్న గంటలోనే ఇంటికి ఫైబర్ సిలిండర్ లను పంపిస్తామని ప్రకటించింది. ఇక ఫైబర్ సిలిండర్ తో లాభాలు చూసినట్టయితే….ఇది గ్యాస్ లేకుంగా గరిష్టంగా 6కిలోల బరువు మాత్రమే ఉంటుంది. మామాలు సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో కనిపించదు కానీ ఇందులో ఎంత గ్యాస్ ఉందో క్లారిటీగా కనిపిస్తుంది. ఇనుప సిలిండర్ కు గ్యాస్ అంటుకుంటే పేలే ప్రమాదం ఉంటుంది. కానీ ఫైబర్ కు మంటలు అంటుకునే ప్రమాదం ఉండదు.