Home » బ్లాక్ బాక్స్: చాప‌ర్ ప్రమాదం వెనుక అసలు రహస్యం ఇదే !

బ్లాక్ బాక్స్: చాప‌ర్ ప్రమాదం వెనుక అసలు రహస్యం ఇదే !

by Bunty
Ad

చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా జనరల్ బిపిన్ రావత్ తమిళ‌నాడులో ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.  విష‌యం విధిత‌మే. అయితే ఆ ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు అన్నీ బ్లాక్ బాక్స్‌లో ఉన్నాయ‌ని, ఆ బ్లాక్ బాక్స్ ప్ర‌మాదం జ‌రిగిన మ‌రుస‌టి రోజు ల‌భ్య‌మైంద‌ని.. ఇప్పుడు అంద‌రి దృష్టి దానిపైకే మ‌ళ్లింది. అస‌లు బ్లాక్ బాక్స్‌లో ఏమి రికార్డు అవుతాయి. ఎలా చేస్తారు అని ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

Advertisement

లోహంతో త‌యారు చేసిన హెలికాప్ట‌ర్ పూర్తిగా ద‌గ్ద‌మైన‌ప్ప‌టికీ.. ర‌హ‌స్యాన్ని అమ‌ర్చే ఈ పెట్టే మాత్రం.. చెక్కు చెద‌ర‌కుండా ఉంది. విమానం, హెలికాప్ట‌ర్ల‌లో బ్లాక్‌బాక్స్‌ను తోక భాగంగా ర‌హ‌స్యాల‌ను తెలిపేందుకు అమ‌ర్చుతారు. ఈ బ్లాక్ బాక్స్‌లో విమానాలు, లేదా హెలికాప్ట‌ర్లు వాటి వేగం, ప్ర‌యాణిస్తున్న ఎత్తు, వాయు పీడ‌నం, గ‌గ‌న యానానికి సంబంధించిన 88 కీల‌క ప‌రిమితుల‌తో పాటు కాక్‌పిట్‌లో సాగే సంభాష‌ణ‌ను రికార్డు చేస్తాయి. దాదాపు ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి కంటే 24 గంట‌ల‌పాటు స‌మాచారాన్ని రికార్డు న‌మోదు చేసుకుని ర‌హ‌స్యంగా ఉంచుతుంది.

 

Advertisement

ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు దానిని గ‌ల కార‌ణాల‌ను గుర్తించ‌గా.. భ‌విష్య‌త్‌లో అలాంటివి పున‌రావృతం కాకుండా ఈ డేటా చాలా కీల‌కంగా మార‌నుంది. ముఖ్యంగా వాణిజ్య‌, సైనిక విమానం, హెలికాప్ట‌ర్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా బ్లాక్‌బాక్స్ అమ‌ర్చుతారు. దీనిని తొలుత 1950లో డేవిడ్ వారెన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు. ఇది సుమారుగా నాలుగున్న కేజీల బ‌రువుంటుంది. ముఖ్యంగా బ్లాక్ బాక్స్‌లో రెండు ర‌కాల రికార్డర్లుంటాయి. ఒక‌టి కాక్‌పెట్ వాయిస్ రికార్డ‌ర్‌.. మరొక‌టి ఫ్లైట్ డేటా రికార్డ‌ర్ ఉంటాయి. అయితే సీవీఆర్‌, ఫైలెట్ మాట‌ల‌ను కాక్‌పెట్ రికార్డ్ చేస్తే..  విమానం, హెలికాప్ట‌ర్‌లో ఉన్న ఎఫ్‌డీఆర్‌లో ఆ డేటా రికార్డు అవుతుంది. ముఖ్యంగా చిఫ్‌ల నుంచి ఆడియోల‌ను డేటా ఫైల్‌ను డౌన్ లోడ్ చేసి కాపీ చేస్తారు.

 

తొలుత డేటాతో ఏమీ తెలియ‌దు. ఆ త‌రువాత కాపీ చేసిన ఫైల్‌ను డీ కోడ్ చేసిన త‌రువాత‌.. వాటిని గ్రాఫ్‌లుగా మార్చాలి. అప్పుడే చిన్న‌పాటి శ‌బ్దాల‌ను వినడానికి స్పెక్ట్రల్ విశ్లేష‌ణ నిపుణులు సాగిస్తారు. ముఖ్యంగా ప్ర‌మాదంతో సంబంధం ఉన్న‌వి రికార్డింగ్ కావ‌డం వ‌ల్ల వీటిని ఆల‌కించే సిబ్బంది క‌ల‌వారిని లోనుకాకుండా ప్ర‌త్యేక కౌన్సిలింగ్ ఇస్తుంటారు.  ఇదంతా ప్రాసెస్ అయిన త‌రువాత గంట‌లు లేదా రోజుల‌లోనే ఈ ప్ర‌మాదానికి సంబంధించి ఒక అభిప్రాయానికి వ‌స్తుంటారు. ఒక నెల త‌రువాత మ‌ధ్యంత‌రం.. ఒక ఏడాది త‌రువాత పూర్తిస్థాయి నివేదిక‌ను స‌మ‌ర్పిస్తారు.

Visitors Are Also Reading