సాదారణంగా అందరూ వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేస్తుంటారు. కొంత మంది మూడు నాలుగు సార్లు చేస్తుంటారు. మరికొంత మంది రాత్రి పడుకొనే ముందు తలస్నానం చేస్తుంటారు. రోజంతా ఆఫీస్ లో గడపడం అలసట ఇంకా పలు శారీరక సమస్యల నుండి రీలీఫ్ పొందేందుకు రాత్రి పూట తలస్నానం చేస్తుంటారు. కానీ అయితే ఆడపిల్లలు రాత్రి పూట స్నానం చేయడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. పలు గ్రంథాల్లో కూడా ఈ ఆడపిల్లలు రాత్రిపూట స్నానం చేయడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. ఆడవారు రాత్రి పూట ఎందుకు తలస్నానం చేయకూడదు..? ఈ విషయం పై సైన్స్ శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.
Advertisement
ఆడవాళ్లలో చాలా మంది రాత్రి పూట తలస్నానం చేసిన తరువాత తమ శిరోజాలను ఆరబెట్టుకోరు. అదేవిధంగా నిద్రకు ఉపక్రమిస్తుంటారు. దీంతో పలు జట్టు సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా జుట్టుకు కుదుళ్లు బలహీనపడతాయి. అలాగే తడి జుట్టుతో పడుకోవడం వల్ల వెంట్రుకల చివర్లు చిట్లిపోతాయి. ఇక జుట్టులో తేమ కారణంగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయని ఫలితంగా జలుబుతో పాటు అలెర్జీ, డాండ్రఫ్, హెయిర్ పాల్ తదితర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Advertisement
ఇక శాస్త్రాల ప్రకారం.. ఆడవారు రాత్రి పూట తలస్నానం చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అదేవిధంగా ఆర్థిక సమస్యలు మొదలవుతాయట. అదేవిధంగా కుటుంబంలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంటికి ఐశ్వర్యం రాదట. ఆడవాళ్లను గృహలక్ష్మిగా భావిస్తారని.. అలాంటిది వారు రాత్రి పూట తలస్నానం చేయడం ఇంటికి మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా మెదడుపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు గ్రహాల రాశుల దిశలు కూడా మారుతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.
Also Read :
దేవుడికి మొక్కులు మొక్కుకుని మరిచిపోతే ఏమవుతుందో తెలుసా..?
భార్య భర్తల మధ్య గొడవలు రావడానికి కారణం ఆ ఒక్క తప్పేనా..?