లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతున్నది. ప్రస్తుతం ఇండియాలో 1000 మంది అబ్బాయిలకు 990 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. కొన్ని కమ్యునిటీస్ లో ఈ సంఖ్య మరీ తక్కువగా ఉంది. తమిళనాడుకు బ్రాహ్మణ అబ్బాయిలకు ఆ రాష్ట్రంలో అమ్మాయిలు దొరకడం లేదు. దాదాపు 40 వేల మంది కంటే ఎక్కువ బ్రాహ్మణ యువకులు పెళ్లికి రెడీగా ఉన్నా వధువు దొరక్క వెయిటింగ్ లో ఉన్నారు.
Advertisement
Advertisement
అందుకే అక్కడి బ్రాహ్మణ సమితి…..తమ యువకులకు తగిన సంబంధం కోసం ఉత్తర ప్రదేశ్ , బీహార్ లోని బ్రాహ్మణలను ఆశ్రయిస్తున్నారు. తమిళనాడులో 10 మంది బ్రాహ్మణ అబ్బాయిలుంటే 6 గురు మాత్రమే అమ్మాయిలున్నారని అలా అయితే ఇక్కడి అబ్బాయిలకు పెళ్లికావడం కష్టమని భావించిన తమిళ్‌నాడు బ్రాహ్మణ సంఘం (తంబ్రాస్) అధ్యక్షుడు ఎన్.నారాయణన్ అసోసియేషన్ మాసపత్రికలో ఒక బహిరంగ లేఖలో మా రాష్ట్ర బ్రాహ్మణ అబ్బాయిలకు ఉత్తరప్రదేశ్, హర్యానా బ్రహ్మణ అమ్మాయిలు కావాలని ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లో కో ఆర్టినేటర్ లను నియమించుకున్నారు.!
Also Read: గుజరాత్ లో నాన్ -వెజ్ ఎందుకు బంద్! 5 కారణాలు!!