పెద్దాపురం(మం) జి.రాగంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో విషాదం చోటు చేసుకుంది. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఏడుగురు కార్మికులు జారిపడి చనిపోయారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్‌కు భారీగా డబ్బు ఇచ్చినట్లు రాజేష్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ పాలసీ ద్వారా లబ్ది పొందినందుకే ఆప్‌కు రాజేష్ డబ్బు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరొకరి అరెస్ట్‌తో కేసు విచారణలో ఈడీ దూకుడు మరింత పెంచింది.
Advertisement
రేవంత్‌రెడ్డి ఓ రోగ్.. నాపై ఇష్టం వచ్చినట్లు రేవంత్ మాట్లాడారు.. నేను సైగ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.. మానుకోట రాళ్ల రుచి రేవంత్‌కు తెలియదు.. ఎర్రబెల్లి ఎదురులేని నాయకుడు, ఆయన్ను విమర్శిస్తావా? అంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యాఖ్యానించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,315 మంది భక్తులు దర్శించుకున్నారు.
Advertisement
నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. నాగ్‌పూర్ వేదికగా ఉ. 9:30 గంటల నుంచి తొలి టెస్టు జరగనుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ. 74,000 గా ఉంది.
టర్కీ, సిరియాలో జరిగిన భుకంపం లో మృతుల సంఖ్య 15 వేలకు చేరుకుంది.
హైదరాబాద్ లో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తపడం లేదు. ఫార్ములా రేసింగ్, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం నెలకొంది.
నారాలోకేష్ యువగళం పాదయాత్ర 14 వ రోజుకు చేరింది. నిన్న సేల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం లో యువనేత లు చురుగ్గా పాల్గొన్నారు.