హైదరాబాద్ రామంతాపూర్‌లోని ఫర్నీచర్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోయింది. సంగారెడ్డి జిల్లాలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సిద్దిపేట జిల్లాలో 10.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా మెదక్ జిల్లాలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Advertisement
నేడు వెస్టిండీస్, జింబాబ్వే మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈ నెల 6న హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. పైలట్ రోహిత్ రెడ్డి తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలకు ఎర వేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.
Advertisement
నంద్యాల ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవికి అఖిలప్రియ సవాల్ విసిరారు.
ఏపీ విశాఖలో నేటి నుంచి రెండ్రోజుల పాటు జాతీయ సదస్సు జరగనుంది. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. 10 రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,100 గా ఉండగా…. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,930 గా ఉంది.
క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్‌లో క్యాన్సర్ నివారణకు రూ.400 కోట్ల కేటాయించింది. కర్నూలులో రూ.120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది.