హైదరాబాద్ లోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయాల్లో 5 గంటలుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయమే సోదాలు ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించగా ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేస్తున్నారు.
ఏపీలో తాడేపల్లి నుంచి తెనాలి పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయలు దేరారు.
Advertisement
టెలిగ్రామ్ యాప్ యూజర్స్ ని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. టెలిగ్రామ్‌లో మెసేజ్ పంపి రూ.2.5 కోట్లు సైబర్ చీటర్స్ కొట్టేశారు. డీజీలో యువతుల ఫోటోలు ఎరవేసి నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారు.
లిక్కర్ స్కాం లో విచారణ కొనసాగుతోంది. తమ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియా ను సీబీఐ విచారిస్తోంది. మనీష్ సిసోడియా విచారణను సీబీఐ వీడియో రికార్డ్ చేస్తోంది.
తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బిజేపి నేతలు అమిత్‌షాతో భేటీకానున్నారు.
Advertisement
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్ పరమతి వేలూరు సమీపంలో కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృ* చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. కంపార్ట్‌మెంట్లలో వేచివుండే అవసరం లేకుండ నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. నిన్న శ్రీవారిని 71,387 మంది భక్తులు దర్శించుకున్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. తెనాలి మార్కెట్ యార్డ్‌లో సీఎం వైఎస్సార్ రైతు భరోసా మూడవ విడత నిధులను బటన్ నొక్కి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
ఏపీ, తెలంగాణల్లో మరో 10 MLC స్థానాలకు మార్చి 29తో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 6న నోటిఫికేషన్…నామినేషన్ల దాఖలుకు చివరి తేది మార్చి 13.. పరిశీలన మార్చి 14..పోలింగ్, కౌంటింగ్ మార్చి 23 న జరగనుంది.