Home » Feb 27th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 27th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

గుంటూరువారి తోట క్రిస్టియన్ పేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పురిటిబిడ్డను కవర్ లో చుట్టి వదిలి వెళ్లిపోయారు. కొత్తపేట పోలీసులు బిడ్డ ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

వరంగల్ నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ టు చెన్నై నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళన కు గురయ్యారు.

Advertisement

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని ఓ కార్ల షోరూం గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో అర్ధరాత్రి మంటలు చెలరేగడం తో మాదాపుర్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని ఆర్పేశారు.

modi

Advertisement

నేడు రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల చేయనున్నారు. రూ.16,800 కోట్ల నిధులను మోడీ విడుదల చేయనున్నారు. 13వ విడత కింద రూ.16,800 కోట్లు విడుదల చేయనున్నారు.

ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్ట్‌ అయ్యారు. మనీష్‌ సిసోడియాను 8గంటలు సీబీఐ ప్రశ్నించింది.

 

జీ20 గురించి తెలియని వారు ఏదో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని శాశించేవి జీ 20 సమావేశాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఢిల్లీ సీబీఐ కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హల్ చల్ చేశారు. లిక్కర్ స్కాంలో నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Visitors Are Also Reading