ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బైపాస్ రోడ్ PLR కన్వెన్షన్ హాల్లో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నారాయణస్వామి, రోజా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు భేటీకి హాజరవుతున్నారు.
ఖమ్మం ఛత్తీస్ గడ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మావోయిస్టులు అమర్చిన IED పేలి CAF హెడ్ కానిస్టేబుల్ సంజయ్ లక్డా చనిపోయాడు.
Advertisement
డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను డీజీపీకి పంపించారు.
హబీబ్ నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. దుండగులు ఇంటిలోకి చొరబడి మహిళపై దాడి చేసి చైన్ లాక్కెళ్లారు. ఇంట్లో నిద్రిస్తున్న టైంలో నిందితుడు విజయ్ కుమారిపై దాడి చేసి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు దొంగిలించారు.
Advertisement
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీకి వెళ్లారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక ఢిల్లీలో మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తున్నారు. నేడు మధ్యాహ్నం 12:30 కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సా.6.30కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు.
తిరుమలలో 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా నిన్న శ్రీవారిని 76,736 మంది భక్తులు దర్శించుకున్నారు.
నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కేప్ టౌన్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.
మార్చి 3వ తేదీనుంచి 7వ తేది వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తోమాల,అర్చన సేవలు ఏకాంతంగా టీటీడీ..ఆర్జిత బ్రహ్మోత్సవం జరగనుంది.
తిరుమల లో మార్చి 1వ తేదీనుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చెయ్యనున్నారు. సర్వదర్శనం,లడ్డు కౌంటర్లు,గదులు కేటాయింపు,రిఫండ్ కౌంటర్లు వద్ద ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చెయ్యనున్నారు.