Home » Feb 25rd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 25rd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నిజామాబాద్ లో ఫైనలియర్ మెడికో విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహ* కలకలం రేపుతోంది. విద్యార్థి ఆత్మహ* పై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామం అని సమాచారం.

డాక్టర్ ప్రీతి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ఎక్మో సపోర్ట్ తో వెంటలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమం గా ఉందని వెల్లడించారు.

Advertisement

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో స్థల వివాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇంట్లోకి మాస్కులు ధరించి వ్యక్తులు, మహిళలు వచ్చారు. స్థలాన్ని ఖాళీ చేయాలంటూ వీరంగం సృష్టించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని జూబ్లిహిల్స్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ కి వెళ్లనున్నారు. రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఏపీ గవర్నర్ ఢిల్లీ వెళుతున్నారు.

Advertisement

బెంగళూరు విజయపూర్‌ జిల్లాలో భూకంపం సంభవించింది. భారీ పేలుడు శబ్ధంతో భూమి కంపించింది. దాంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

హైదరాబాద్ లో మాజీ మంత్రి నారాయణ ఇళ్ళల్లో రెండో రోజు ఏపీసీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. నారాయణ ఇద్దరు కూతుళ్ళ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన పాసింజర్ దగ్గర నుంచి 800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. లో దుస్తుల్లో బంగారాన్ని పెట్టి తీసుకు వచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల బరిలో 40 మంది భరిలో దిగుతున్నారు. మొత్తం 44 నామినేషన్ల దాఖలయ్యాయి. 4 నామినేషన్ లను తిరస్కరించారు.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవారి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేశారు. మార్చి,ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టిక్కెట్ల కోటాను విడుదల చెయ్యనున్నారు.

Visitors Are Also Reading