Home » Feb 23rd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 23rd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తజికిస్తాన్‌ లోని ముర్గోబ్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రత తో భూకంపం నమోదయ్యింది.


నేడు వికలాంగుల కోటా దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో మార్చి నెల టికెట్లు విడుదల చేసింది. రేపు ఉదయం 9గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనుంది. రేపు మ. 2 గంటలకు మే నెల కోటా అంగ్ర ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనుంది.

Advertisement

జనగామ జిల్లా పాలకుర్తిలో లారీ బీభత్సం సృష్టించింది. ట్రాక్టర్‌ను ఢీకొట్టి రోడ్డుపక్కన షాపులోకి లారీ దూసుకెళ్ళింది. లారీ క్యాబిన్‌లో ఇరుకున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు.

నేడు మహిళల టీ20 వరల్డ్‌కప్‌ తొలి సెమీఫైనల్‌ జరగనుంది. ఆసీస్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Advertisement

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ నుంచి బళ్లారి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడం తో అధికారులు తనిఖీ చేస్తున్నారు.

షూటింగ్‌లో నటుడు విశాల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాల్‌తో పాటు ఫైటర్స్‌ పైకి వాహన దూసుకెళ్లింది. ఒక్కసారిగా బ్లాస్ట్‌ అవుతూ వాహనం దూసుకెళ్లడంతో నలుగురికి గాయాలయ్యాయి.

విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్‌ తీసుకువచ్చింది. విద్యార్థుల వయస్సు 6 ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది.

జనసేన క్రీయాశీలక కార్యకర్తల బీమా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం అందజేశారు.

పీఎం కిసాన్ యోజన 13వ విడత నిధులను కేంద్రం ఈ నెల 27న విడుదల చేయనుంది.

లోకేష్ పాదయాత్ర తో రేణిగుంట లో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ ప్లెక్స్ లను రెవెన్యూ అధికారులు తీసేయడం తో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Visitors Are Also Reading